'గంగోత్రి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఆర్య సినిమాతో అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నాడు. ఒక్కో సినిమాలో ఒక్కో స్టైల్‌లో కనిపిస్తూ అభిమానులతో స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు.
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనలోని టాలెంట్‌ను బయటపెడుతూ స్టైల్‌కు ఐకాన్‌గా మారి.. ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు బన్నీ. తాజాగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ఈ ఐకాన్ స్టార్.
పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా..
సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా ఉన్నా నిజజీవితంలో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటాడు బన్నీ. సినిమాలంటే ఎంత డెడికేషన్ చూపిస్తాడో అంతే శ్రద్ధను, సమయాన్ని తన ఫ్యామిలీకి కూడా కేటాయించి మంచి హీరో, భర్త, తండ్రి అనిపించుకుంటాడు.
ఇక, తన ఫ్యామిలీతో ఉండే ఇంటిని ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు అల్లు అర్జున్. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉండే బన్నీ.. స్విమ్మింగ్ పూల్, జిమ్, క్వాలిటీ ఫర్నీచర్, లేటెస్ట్ డిజైన్‌తో ఇంద్రభవనాన్ని తలపించేలా 'బ్లెస్సింగ్' పేరుతో ఓ ఇల్లు కట్టించుకున్నాడు. ఆ ఇంటి ప్రత్యేకతలపై ఒక లుక్ వేద్దాం.
డ్రీమ్ హౌస్ పేరు ‘బ్లెస్సింగ్’
తన డ్రీమ్ హౌస్‌కు 'బ్లెస్సింగ్' అని పేరు పెట్టుకున్నాడు బన్నీ. ఆ ఇంటిలో అల్లుఅర్జున్, ఆయన భార్య స్నేహ లతా రెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ ఉంటారు. సుమారు 8 వేల అడుగుల అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంట్లో అల్లు అర్జున్ ఫ్యామిలీతోపాటు వాళ్ల పెట్ డాగ్ కజోకు కూడా ఉంటుంది.
పిల్లల కోసం ప్రత్యేక గదులు
అల్లు అర్జున్ తన డ్రీమ్ హౌస్‌లో పిల్లలు అర్హ, అయాన్‌ల కోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశాడు. ఇక, ఫ్యామిలీ పార్టీలు చేసుకోవడానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉండేలా బార్ రూమ్‌ను నిర్మించుకున్నాడు. స్విమ్మింగ్ పూల్, డైనింగ్ టేబుల్‌ను స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్నాడు బన్నీ. ఇంట్లోకి వెళ్లగానే పెద్ద కారిడార్.. అక్కడి నుంచి నేరుగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకునేలా ప్లాన్ చేసుకున్నాడు.
స్పెషల్‌గా టీవీ రూమ్..
పిల్లలు, ఫ్యామిలీతో కలిసి టీవీ చూడడానికి ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించుకున్నాడు బన్నీ. కుటుంబంతో సరదాగా గడుపుతూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేసేలా, ఆ గదిలో విలాసవంతమైన కుర్చీలను ఏర్పాటు చేసుకున్నాడు.
అల్లు అర్జున్ టేస్ట్‌కి తగ్గట్టుగా..
బన్నీ లగ్జరీ హౌస్‌ను ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆమిర్ శర్మ డిజైన్ చేశాడు. అల్లు అర్జున్ (Allu Arjun) టేస్ట్‌కు తగినట్టుగా ఇంటిని నిర్మించడానికి అన్ని విధాలుగా కృషి చేశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడాయన.
మల్టీపర్పస్ యూసేజ్ చేసుకునేలా మూవబుల్ బెంచ్‌లు, లో మెయింటెనెన్స్ మెటీరియల్‌ను నిర్మాణంలో వాడామని ఆయన అన్నాడు. ఇక, ఇంటి ముందు భాగంలో ఎటువంటి డిజైలు వేయలేదని, కేవలం గ్లాస్ మాత్రమే వాడామని తెలిపాడు ఆర్కిటెక్ట్ శర్మ. కలర్‌ఫుల్ నర్సరీని కూడా ఏర్పాటు చేశామని తెలిపాడు.
Read More: అల్లు అర్జున్ తన వైఫ్ స్నేహతో కలిసి ప్లాన్ చేసిన.. రొమాంటిక్ డేట్ నైట్ విశేషాలు మీకోసం
Follow Us