ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) స్ఫూఫ్ వీడియోలకు పెట్టింది పేరు. మైదానంలో ఈ ఆటగాడు ఎంత అద్భుతంగా క్రికెట్ ఆడుతుంటాడో.. అలాగే ఖాళీ సమయంలో తన స్ఫూఫ్ వీడియోలతో అభిమానులకు అంతే వినోదం పంచుతూ ఉంటాడు.
ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేయడంలో ఈయనది అందె వేసిన చేయి. ఇప్పటికే శ్రీమంతుడు, పుష్ప సినిమాలలోని సీన్లను స్ఫూఫ్ చేసి అందరినీ అలరించాడు డేవిడ్ వార్నర్.
ఫేస్ మార్ఫింగ్ చేయడంలో దిట్ట
తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మీద కూడా ఓ స్ఫూఫ్ వీడియో చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు వార్నర్. రష్మికా మందన్న (Rashmika Mandanna) ముఖాన్ని తన ఫేస్‌గా మార్చుకున్న వార్నర్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశాడు. ఈ ఫేస్ మార్ఫింగ్ కోసం తరచూ ఆయన ఓ యాప్ వాడుతుంటాడు.
నితిన్ కథానాయకుడిగా నటించిన "భీష్మ" సినిమాలోని ఐటం సాంగ్‌ను స్ఫూఫ్ చేసిన వార్నర్ "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు" అనే పాట లిరిక్స్‌కు, తన స్ఫూఫ్ వీడియో భాగాలను జత చేశాడు. ఆ వీడియోలో రష్మికా మందన్నగా మారి స్టెప్పులు కూడా వేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Follow Us