Tamannaah Bhatia: టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించటంలో దర్శకుడు అనిల్ రావిపూడికి ఓ సపరేట్ స్టైల్ ఉంది. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన చిత్రం F3. కాగా, గతంలో ఆయన డైరెక్షన్‌లో రూపొందిన F2కి ఫ్రాంఛైజీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ విజయాన్ని అందుకుంది. అయితే, F3 సినిమాను ప్రమోట్ చేయటంలో చిత్ర యూనిట్‌లోని సభ్యులందరూ తమ వంతుగా భాగస్వామ్యం అయ్యారు.
కానీ, హీరోయిన్ తమన్నా మాత్రం ప్రమోషన్స్‌లో అస్సలు కనపడలేదు. దీంతో అసలు ఏం జరిగిందా అని కొందరు ఆరా తీయగా.. F3 సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) కు మధ్య ఏవో గొడవలు జరిగాయని, అందుకనే ఆమె సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని తమకు సంబంధించిన అనుబంధ మీడియాల్లో రాశారు. ఇదే విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Raipudi)ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆయన మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో స్టార్ కాస్ట్ ను అందరినీ సమన్వయం చేస్తూ పనిచేయడం దర్శకులకు సవాల్ లాంటిదే.
ఈ క్రమంలో కాస్త షూటింగ్ టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. మన తెలుగు వాళ్లు ఏ టైంకైనా ఒకేనంటారు. ముంబయి యాక్ట్రెస్ టైమింగ్ మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్ర 6 గంటల వరకు ఉంటుంది. ఈక్రమంలో ఒక సందర్భంలో తమన్నాకు (Tamannaah Bhatia) మార్నింగ్ షూట్ షెడ్యూల్ అయ్యింది. దీంతో ఆమె మార్నింగ్ రెగ్యూలర్ వర్కవుట్స్ ఫినిష్ చేసుకోకుండా షూట్ కు రాలేనంటూ చెప్పేసింది. దీంతో కాస్త హీట్ వెదర్ నెలకొంది. ఆ తర్వాత అంతా మమూలైపోయిందన్నారు. అయితే, ఆ తర్వాత ఎఫ్4 స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుతూ ఎఫ్4లో హీరోలు మారకపోవచ్చు గానీ, హీరోయిన్స్ మాత్రం తప్పకుండా మారే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎఫ్4లో మిల్క్ బ్యూటీ కనిపించకపోవచ్చని అర్థమైపోతోంది.
కాగా, ఎఫ్3లో వెంకటేశ్, వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో పోషించారు. తమన్నా భాటియా మరియు మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సీక్వెల్ లో సునిల్, అలీ కూడా నటించడంతో సినిమాలో కామెడీ మరింత పండింది. అయితే, సినిమా షూటింగ్స్ సమయంలో ఆర్టిస్టులకు, దర్శకుడు, నిర్మాతలకు మధ్య మనస్పర్థలు రాడవం సహజం. అయితే ఈ విషయాలన్నీ ఎంత గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా.. ఏదో ఒక విధంగా బయటికి వస్తూనే ఉంటాయి.
Follow Us