Brahmastra: ‘బ్ర‌హ్మ‌స్త్రం’ నుంచి 'దేవ.. దేవ‌' సాంగ్ రిలీజ్.. అగ్ని అస్త్రంతో సంద‌డి చేసిన ర‌ణ్‌బీర్

Brahmastra: త‌న‌లో అగ్ని అస్త్రం ఉంద‌ని తెలుసుకున్న ర‌ణ్‌బీర్ ఎలా రియాక్ట్ అవుతారో తెలిపే పాట‌గా 'దేవ.. దేవ' సాగింది.

బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor), అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘బ్ర‌హ్మ‌స్త్రం’ (Brahmastra)  సినిమా నుంచి 'దేవ.. దేవ‌' అనే లిరిక‌ల్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 'వేక్ అప్ సిడ్', 'ఏ జవానీ హై దివానీ' లాంటి హిందీ సినిమాలను డైరెక్ట్ చేసిన అయాన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాజ‌మౌళి సమ‌ర్ఫ‌ణ‌లో ‘బ్ర‌హ్మ‌స్త్రం’ సినిమా సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 

 

 

విజువ‌ల్ వండ‌ర్‌గా సాగిన‌ దేవ సాంగ్

'బ్ర‌హ్మాస్త్రం'  (Brahmastra) సినిమాలో ర‌ణ్‌బీర్ క‌పూర్ అగ్ని అస్త్రాన్ని క‌లిగి ఉంటాడు. ర‌ణ్‌బీర్‌లో ఉన్న అస్ల్రాన్ని గురించి అమితాబ్ బ‌చ్చ‌న్ చెబుతారు. త‌న‌లో అగ్ని అస్త్రం ఉంద‌ని తెలుసుకున్న ర‌ణ్‌బీర్ ఎలా రియాక్ట్ అవుతారో తెలిపే పాట‌గా 'దేవ.. దేవ' సాగింది. ఈ పాట‌లో విజువ‌ల్స్‌ను అద్భుతంగా తెర‌కెక్కించారు.

'బ్ర‌హ్మాస్తం' సినిమాకు ప్రీత‌మ్ సంగీతం అందించారు. 'దేవ‌.. దేవ' పాట‌కు చంద్ర‌బోస్ లిరిక్స్ రాశారు. ఈ పాట‌ను శ్రీరామ చంద్ర, జోనితా గాంధి ఆల‌పించారు. ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌లైన 'కుంకుమ‌ల' పాట‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది.  

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున కూడా 'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పురావస్తు శాఖ నిపుణుడు అజయ్‌ విశిష్ఠ్‌ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ అరవింద్‌ చతుర్వేది పాత్రలో అమితాబ్‌ బచ్చన్ న‌టించారు. విల‌న్ దమయంతి పాత్ర‌లో మౌనీ రాయ్ న‌టించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కూడా ఓ సైంటిస్ట్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. 'బ్ర‌హ్మాస్త్రం' మూడు భాగాలుగా తెర‌కెక్కుతుంది. 'బ్ర‌హ్మాస్త్రం' మొద‌టి భాగం శివ పేరుతో  హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది.

Read More: Brahmastra : రణ్‌బీర్ కపూర్, నాగార్జున నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాకి.. చిరంజీవికి కనెక్షన్ ఏమిటి ?

Credits: Twitter
You May Also Like These