ఇటీవలికాలంలో తెలుగులో వచ్చిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీల్లో ‘సీతారామం’ (Sitaramam) ఒకటి. అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అఖండ విజయాన్నందుకుంది. కాగా, ఈ చిత్రంపై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక, సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రామ్ గా దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచేశారు.
‘సీతారామం’ (Sitaramam) సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే.. 'సీతారామం' సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ నటన అద్భుతమని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut)ప్రశంసించారు. ‘మృణాల్ నిజంగానే ఓ రాణి. జిందాబాద్ ఠాకూర్ సాబ్. ఇక ముందు ముందు కాలం మీదే’ అంటూ ఇన్ స్టా పోస్ట్ లో పేర్కొన్నారు. తన పోస్టులో ఒక రాణి ఎమోజీని కూడా పోస్ట్ చేశారు.
హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్నా (Rashmika Mandanna), సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యుద్దం నేపథ్యంతో రాసిన ఈ ప్రేమకథను తెలుగుతో పాటు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు.
Follow Us