టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' (Bahubali) సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఆ సినిమా తరువాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు అభిమానుల అంచనాలను తలకిందులు చేశాయి. అయినా కూడా చేతినిండా భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రభాస్ ఫుల్ బిజీ అయ్యారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ మన డార్లింగ్ ప్రభాస్ తో పలు ప్రాజెక్టులు చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రభాస్ తర్వాతి సినిమాల్లో ఒకటైన 'ఆదిపురుష్' (Adipurush) నుంచి నిన్న టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఆదివారం సాయంత్రం రామ జన్మభూమి అయోధ్య వేదికగా ఫుల్ విజువల్ వండర్ ఇచ్చేశారు డైరెక్టర్ ఓంరౌత్. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.
ఇక, తాజాగా విడుదలైన 'ఆదిపురుష్' టీజర్ (Adipurush Teaser) లో "భూమి కుంగినా, నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి ఆగమనం.. అధర్మ విధ్వంసం" అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ లోనూ విడుదల కాబోతోంది.
అయితే, 'ఆదిపురుష్' సినిమా టీజర్ (Adipurush Teaser) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హిందీలో ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పలేదట. నటుడు శరద్ కేల్కర్ (Sharad Kelkar) 'ఆదిపురుష్'లో ప్రబాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారట. గతంలో 'బాహుబలి' సినిమా సమయంలో కూడా హిందీలోప్రభాస్ పాత్రకు శరద్ కేల్కర్ వాయిస్ అందించడం విశేషం.
కాగా, 'ఆదిపురుష్' (Adipurush) సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 15భాషల్లో.. వరల్డ్ వైడ్‌గా 20,000వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ‘ఆదిపురుష్’ పాన్ ఇండియా లెవల్ దాటిపోయి.. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాబోతోంది. దీంతో ఆదిపురుష్ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చేయబోతుంది. అంతేకాదు ఈ సినిమాను 3Dతో పాటు డాల్బీ (Dolby)లో విడుదల చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
Read More: ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ (Adipurush) టీజర్! న్యాయం చేతుల్లోనే అన్యాయానికి వినాశనం
Follow Us