చిరంజీవి గురించే ఆచార్యలో ప్రత్యేక పాటను అంగీకరించా.. ఇకపై చేయను: రెజీనా కసాండ్రా (Regina Cassandra)

రెజీనా కసాండ్రా (Regina Cassandra)

రెజీనా కసాండ్రా (Regina Cassandra) గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సుధీర్‌‌బాబు హీరోగా నటించిన శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది రెజీనా. ఈ సినిమాతో అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మంచి అవకాశాలను చేజిక్కించుకుంది.

అందం, అభినయంతో పేరు తెచ్చుకున్నా బాక్సాఫీస్‌ దగ్గర సరైన విజయం దక్కలేదనే చెప్పాలి. రొటీన్ లవ్‌ స్టోరీ, పిల్లా నువ్వు లేని జీవితం, పవర్, సుబ్రమణ్యం ఫర్‌‌ సేల్, ఎవరు, విశాల్‌ చక్ర సినిమాల్లో నటించి మంచిపేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్‌ నటించిన ఆచార్య సినిమాలో ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ పాటలో నర్తించింది.

తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్న రెజీనా 1990 డిసెంబర్‌‌ 13వ తేదీన చెన్నైలో పుట్టింది. తొమ్మిది సంవత్సరాల వయసులోనే స్ప్లాష్‌ అనే కిడ్స్ చానల్‌లో యాంకరింగ్ చేసిన రెజీనా..2005వ సంవత్సరంలో కాండ నాల్‌ ముదాల్‌ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2010లో కేఎమ్‌ చైతన్య దర్శకత్వం వహించిన సూర్యకాంతి అనే కన్నడ సినిమా చేసింది. సినిమాలు చేస్తున్న పెద్దగా పేరు రాకపోవడంతో కొంత గ్యాప్ తీసుకుని చెన్నైలోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేయడానికి వెళ్లింది.

ఈ గ్యాప్ సమయంలో బాలాజీ మోహన్‌ తీసిన కాదలిల్‌ సోదప్పువాదు యెప్పాడితోపాటు పలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది రెజీనా.  బాలాజీ మోహన్‌ తీసిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను 2012లో అదే పేరుతో సినిమాగా కూడా తీశాడు. తెలుగులో సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన రొటీన్ లవ్ స్టోరీ సినిమాకు ముందుగా సంతకం చేసింది రెజీనా అయితే ఆ సినిమా రిలీజ్‌కు ముందే సుధీర్‌‌ హీరోగా సత్య తాతినేని దర్శకత్వంలో వచ్చిన శివ మనసులో శృతి అనే తమిళ రీమేక్‌ రిలీజ్‌ అయ్యింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా చేసిన కొత్త జంట సినిమాలో హీరోయిన్‌గా చేసి మంచి పేరు తెచ్చుకుంది రెజీనా. ఈ క్రమంలో రారా కృష్ణయ్య సినిమాతో మరోసారి సందీప్ కిషన్‌తో జత కట్టిన రెజీనా.. రవితేజ నటించిన పవర్‌‌ సినిమాలో బెంగాలీ భామగా చాన్స్‌ కొట్టేసింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్‌తో చేసిన పిల్లా నువ్వు లేని జీవితం సినిమా రెజీనాకు మంచిపేరు తెచ్చిపెట్టింది.

సుమారు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత తమిళంలో రాజతందిరం అనే సినిమా చేసిన రెజీనా తన యాక్టింగ్‌కు మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత తెలుగులో సాయిధరమ్‌ తేజ్ పక్కన సుబ్రమణ్యం ఫర్ సేల్, గోపీచంద్ సరసన సౌఖ్యం, శంకర సినిమాల్లో నటించింది రెజీనా. 2019లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ తమిళ బ్యూటీ.

‘ఏక్‌ లడ్‌కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాలో నటించింది. ఇక, 2019లో ఎవరు సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేసిన రెజీనా.. ఆ సినిమాలోని నటనకుగాను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. 2021లో కూడా పలు సినిమాల్లో నెగెటివ్ రోల్స్‌ చేసి మెప్పించింది.

రాకెట్ బాయ్స్‌ సిరీస్‌తో వెబ్‌ దునియాలోకి అడుగుపెట్టింది రెజీనా. ఆ సిరీస్‌లో మృణాళిని సారాభాయ్‌ పాత్రలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సూరపనాగై (తెలుగులో నేనే నా), కారుంగాపియం, శాకినీ ఢాకినీ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇక, బార్డర్, పార్టీ, కల్లాపార్ట్ సినిమాలతోపాటు విజయ్ సేతుపతితో కలిసి చేస్తున్న ఫర్జి సిరీస్‌ ప్రాజెక్టులు రెజీనా చేతిలో ఉన్నాయి.

కాగా, ఇటీవల రెజీనా (Regina Cassandra) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆచార్య సినిమాలో ప్రత్యేక గీతానికి డ్యాన్స్ చేయడంపై.. చిరంజీవి సినిమా కాబట్టే ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేయడానికి అంగీకరించానని, ఇకపై ప్రత్యేక గీతాల్లో నటించబోనని తేల్చి చెప్పింది రెజీనా. ఆ పాటలో చేయడానికి ముందే చాలా ఆఫర్లు వచ్చాయని, అయితే వేటికీ తాను అంగీకారం తెలపలేదని చెప్పుకొచ్చింది. తనకు అటువంటి పాటల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పింది. 

Read More: 'మేజర్' సినిమాపై చిరంజీవి ప్రశంసలు.. యూనిట్ కు స్పెషల్ డిన్నర్!

You May Also Like These