Jacqueline Fernandez : బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌‌కు బెయిల్.. మనీ లాండరింగ్ కేసులో శ్రీలంక భామ !

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అందించిన వివరాలను పరిశీలించి న్యాయస్థానం ఫెర్నాండేజ్‌కు (Jacqueline Fernandez) బెయిల్ మంజూరు చేసింది.

సాహో, విక్రాంత్ రోణ లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో పాపులర్ అయిన బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ఈ భామ విచారణను ఎదుర్కొంటోంది. 

అయితే ఇప్పటికే విచారణ పూర్తయి, ఛార్జి షీటు దాఖలు చేసినందుకు తనకు కస్టడీ విధించాల్సిన అవసరం ఏముందని, తనకు బెయిల్ మంజూరు చేయమని జాక్వెలిన్ (Jacqueline Fernandez) న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. 

ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అందించిన వివరాలను పరిశీలించి న్యాయస్థానం ఫెర్నాండేజ్‌కు (Jacqueline Fernandez) బెయిల్ మంజూరు చేసింది. గత నెల ఈమెకు రూ. 50 వేల పూచీకత్తు బెయిల్‌ను కోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తి బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.  

శ్రీలంకలో పుట్టి పెరిగిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. 2006 లో ఈమె శ్రీలంక తరఫున మిస్ యూనివర్స్ అందాల పోటీలకు హాజరైంది. హౌస్ ఫుల్ 2, రేస్ 2, కిక్ లాంటి సినిమాలు ఈమెకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. 

ఓ చిన్న పిల్లల డ్యాన్స్ షోకు గతంలో జాక్వెలిన్ న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది. 'అల్లాదీన్' అనే బాలీవుడ్ సినిమాలో నటనకు గాను ఈమె ఉత్తమ తొలి చిత్ర నటిగా ఐఫా అవార్డును సొంతం చేసుకుంది. 
 

Credits: Instagram
You May Also Like These