Allu Arjun: ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్ సందడి

Published on Apr 19, 2022 07:01 PM IST

ఐరోపా.. హీరో అల్లు అర్జున్‌కి బాగా ఇష్టమైన ప్రదేశం. తనకు వీలు దొరికినప్పుడల్లా ఆయన అక్కడ సేదతీరుతుంటారు. ఇటీవలే మళ్లీ వెళ్లారు. తన కుటుంబంతో సహా హాయిగా గడిపారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన విహారయాత్రను ముగించుకొని భారతదేశానికి తిరిగివచ్చాక.. ఇదిలో ఇలా ఎయిర్ పోర్టులో కెమెరామెన్ల కళ్లకు చిక్కారు. ఈ వీడియో మీకోసం ప్రత్యేకం

అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా పలు రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఉత్తరాదిలో ఆయనకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌‌ను ఈ సినిమా ఆయనకు క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 పనులలో ఆయన బిజీగా ఉన్నారు.