Allu Arjun on Ranveer Singh, Vijay Deverakonda’s style : స్టైల్ పై స్టైలిష్ స్టార్ మాటు

Published on Apr 18, 2022 05:07 PM IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యూత్‌ను ఎక్కువగా ఆకర్షించే స్టైలిష్ నటులలో ఒకరైన అల్లు అర్జున్, తన కెరీర్ ప్రారంభం నుండే ఒక సరికొత్త పంథాను ఏర్పరచుకున్నాడు. స్టైలిష్ స్టార్‌గా అభిమానుల ఆదరణను పొందాడు. భారతదేశంలోనే బెస్ట్ డ్యాన్సర్‌లలో ఒకరైన అల్లు అర్జున్, పుష్ప హిట్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. బన్నీ నటించిన  నా పేరు సూర్య చిత్రం యూట్యూబులో కొన్ని మిలియన్ల వ్యూస్‌ని దక్కించుకొని, అతని ప్రతిభను ప్రపంచానికి సైతం చాటింది.  ఇక అల వైకుంఠపురములో చిత్రం అయితే, ఇటీవలే హిందీలో డబ్ చేయబడి, థించాక్ టీవీలో హయ్యస్ట్ టీఆర్పీని నమోదు చేసింది. 

ఇటీవలే పింక్‌విల్లాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, మాస్ హీరో అల్లు అర్జున్  తన తదుపరి చిత్ర విశేషాలతో పాటు, రణవీర్ సింగ్ మరియు విజయ్ దేవరకొండల డ్రెస్సింగ్ స్టైల్ మొదలైన వాటి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం విశేషం.