Allu Arjun decodes the Pushpa success : పుష్ప సక్సెస్‌కి కారణం ఏమిటంటే..?

Published on Apr 18, 2022 04:54 PM IST

పుష్ప.. ఈ చిత్రంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా కలెక్షన్ల సునామీ కురిపించింది. బాలీవుడ్ విమర్శకులను కూడా విస్తుపోయేలా చేసింది. ముఖ్యంగా అల్లు అర్జున్ మేనిరిజమ్స్ అనేవి అన్ని వయసుల వారిని విపరీతంగా ఆకర్షించాయి. శ్రీవల్లి.. పాటకు టిక్ టాక్‌లో కొన్ని కోట్లమంది ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. చందనాన్ని స్మగ్లింగ్ చేసే మాఫియాదారుగా పుష్ప చిత్రంలో బన్నీ నటన నభూత్ నభవిష్యత్ అని చెప్పుకోవచ్చు. తనకిచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన బన్నీ.. ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. మరి ఈ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్స్ ఏమిటో ఆయన మాటల్లోనే విందామా