వెంకటేష్ (Venkatesh), వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎఫ్3’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే వంద కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దీంతో ‘ఎఫ్3’ బృందం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ సందర్భంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ‘ఫన్’ టాస్టిక్ ఈవెంట్‌ను వైజాగ్‌లో శనివారం నిర్వహించారు.
ఈ ఈవెంట్లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’ వైజాగ్‌లో చేశాను. ‘స్వర్ణ కమలం’, ‘గోపాల గోపాల’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మల్లీశ్వరి’, ‘గురు’ ఇలా చాలా చిత్రాల షూటింగ్‌లు వైజాగ్‌లోనే జరిగాయి. వైజాగ్ అంటే ప్రత్యేక అభిమానం. దిల్ రాజు మంచి స్ర్కిప్ట్‌తో వచ్చారు. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందించారు. ‘నారప్ప’, ‘దృశ్యం’ ఓటీటీకి వెళ్లడంతో అభిమానులు నిరాశ చెందారు. అందుకే ఎఫ్ 3లో నారప్ప గెటప్‌లో వచ్చి ఫ్యాన్స్‌ని థ్రిల్ చేయాలనుకున్నా’ అని చెప్పాడు వెంకటేష్.
ప్రశంసలే వందకోట్లు: వరుణ్‌తేజ్
‘200 మంది నటీనటులతో సుమారు రెండు సంవత్సరాలు కష్టపడి రెండున్నర గంటల సినిమాను మీ ముందుకు తెచ్చాం. డబ్బులు, కలెక్షన్లు ఇవేమీ ఇవ్వని కిక్.. ప్రేక్షకులు సినిమా చూసి శభాష్ అంటే వస్తుంది. ప్రేక్షకుల ప్రశంసే మాకు వందకోట్లు. ఇంత మంచి సినిమా రావడానికి కారణం డైరెక్టర్ అనిల్. ఆయనది యునీక్ స్టైల్. దానితోనే వరుసగా ఆర్లు హిట్లు కొట్టారు. అలాగే 36 హిట్లు కొట్టాలి. వెంకటేష్ గారితో సెట్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఆయనతో సినిమా అంటే కథ కూడా వినకుండా ఓకే చెప్పేస్తా’ అని వరుణ్ చెప్పాడు.
వంద కోట్లతో తిరిగిచ్చారు: అనిల్ రావిపూడి
‘వైజాగ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నేను రాసే ప్రతి స్ర్కిప్ట్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ‘ఎఫ్3’ విడుదలైన తొమ్మిది రోజుల్లో వందకోట్లు క్రాస్ చేసిన క్రెడిట్ ప్రేక్షకులకే దక్కుతుంది. ‘ఎఫ్ 3’ విజయంతో ‘ఎఫ్2’ ఫ్రాంచైజీని కొనసాగించవచ్చనే ధైర్యాన్ని ఇచ్చారు. నవ్వుకోవడానికే ఈ సినిమా తీశామని మొదటి నుంచి చెబుతున్నాం. ఆ నవ్వుల విలువను వంద కోట్లతో తిరిగిచ్చారు ప్రేక్షకులు. ‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ని ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే ‘ఎఫ్ 4’ ప్రకటన కూడా వస్తుంది’ అని అనిల్ చెప్పుకొచ్చాడు.
లాజికల్‌గా మ్యాజికల్‌గా చింపే సినిమా చేస్తాం: దిల్ రాజు
‘‘ఎఫ్3’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇది తొమ్మిదో రోజు. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సినిమా ముందుకు వెళుతోంది. కరోనా తర్వాత ఓ ఫ్యామిలీ సినిమా వంద కోట్లు టచ్ చేయడం ఎంతో ప్రత్యేకం. జగదాంబలో 11 వందల సీట్లు ఫుల్ కావడం అంటే మామూలు విషయం కాదు. ‘ఎఫ్4’ని ఎలా ప్లాన్ చేయాలనే అనిల్‌కు టెన్షన్ మొదలైంది. లాజికల్‌గా మ్యాజికల్‌గా చింపే సినిమా చేద్దాం. అదే మన గోల్. ‘ఎఫ్ 4’ కోసం వెయిట్ చేస్తూ ఉండండి’ అని దిల్ రాజు అన్నాడు. వెంకటేష్(Venkatesh), వరుణ్ తేజ్ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాడు.
Read More: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో వెంకటేష్ (Venkatesh) నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్
Follow Us