Telugu Biggboss: 'బిగ్ బాస్ సీజన్ 6' లోకి మాజీ స్టార్ యాంకర్ ఉదయ భాను (Udaya Bhanu).. రెమ్యునరేషన్ ఎంతంటే?

Advertisement
మాజీ స్టార్ యాంకర్ ఉదయభాను (Udaya Bhanu) లేటెస్ట్ సీజన్లో సందడి చేయడం ఖాయమంటూ కథనాలు వెలువడుతున్నాయి.

Telugu Biggboss: తెలుగు బిగ్ బాస్ షో గురించి అందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఐదు సీజన్ లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఆరో సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలామంది ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. బుల్లి తెర షోస్ నుంచి చాలామందిని ఇప్పటికే సంప్రదించింది బిగ్ బాస్ టీమ్‌.  

గత రెండు సంవత్సరాలలో కరోనా కారణంగా బిగ్ బాస్ 4,5 (Biggboss Season 6) సీజన్లలో చాలావరకు కొత్త ముఖాలే కనిపించాయి. అయితే ఈ సారి మాత్రం ప్రేక్షకుల కోరిక మేరకు ఫేమస్ ఫేసెస్ ని తీసుకొచ్చి ఈసారి షోని నిర్వహించాలని కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ షో నిర్వాహకులు. అందుకే స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ కి  చెందిన పాపులర్ యాక్టర్స్ ని, యాంకర్స్ ని కాంటాక్ట్ చేస్తున్నారట. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయగా.. మరికొంతమందిని సంప్రదించినట్లు తెలుస్తోంది. 

Advertisement

ఈ క్రమంలో కంటెస్టెంట్స్ గా కొన్ని క్రేజీ నేమ్స్ తెరపైకి వస్తున్నాయి. మాజీ స్టార్ యాంకర్ ఉదయభాను (Udaya Bhanu) లేటెస్ట్ సీజన్లో సందడి చేయడం ఖాయమంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈమెకు మంచి రెమ్యూనరేషన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారట. అన్ని ఓకే ఐతే గనక బిగ్ బాస్ సీజన్ 6లో ఉదయభాను ఎంట్రీ ఇవ్వ‌డం దాదాపు ఖాయం. కాగా, గతంలోనే ఉదయభాను బిగ్ బాస్ లో పాల్గొనాల్సింది. అయితే అప్పుడు పెద్దగా ఆసక్తి చూపించని ఉదయ భాను ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

శేఖర్ కమ్ముల 'లీడర్' (Leader Movie) సినిమాలో ఓ ప్రత్యేక పాటలో కనిపించిన ఉదయభాను.. అప్పట్లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు భావించారు. కానీ ఆమె ఎక్కువగా ఈటీవీ షోల్లో మాత్రమే కనిపిస్తోంది. మిగతా వాటిల్లో తక్కువగానే పాల్గొంటోంది.

దీంతో ఉదయ భానును (Udaya Bhanu) ఎలాగైనా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మొత్తానికి ఉదయభాను బిగ్ బాస్ కు వస్తే దాని ప్రతిష్ట మరింత ఇనుమడించే అవకాశాలున్నందునే ఆమె రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.

Read More: త్వరలో బిగ్ బాస్ సీజన్ 6.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్!

Advertisement
You May Also Like These
Advertisement