Biggboss Season6: బిగ్ బాస్ హౌస్ లో సింగర్ రేవంత్(Singer Revanth)కు మధుర జ్ఞాపకం.. సతీమణి సీమంతం చూసే అవకాశం!

Advertisement
వీడియో చూస్తున్నంత సేపు రేవంత్ (Singer Revanth) కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వీడియో చూడగానే క‌ప్‌ గెలిచినంత ఆనందంగా ఉందని రేవంత్ అన్నాడు.

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) లో నిన్నటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. సింగర్ రేవంత్ కు, ఆయన భార్యకు జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు బిగ్‌బాస్. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో వచ్చే సమయానికి ఆయన భార్య నిండు గర్భిణీ. చాలా సందర్భలలో తన భార్య గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు కూడా.. దీంతో నిన్నటి ఎపిసోడ్ లో రేవంత్ భార్య సీమంతాన్ని చూపించారు. 

ఇందులో భాగంగానే ముందుగా సింగర్ రేవంత్ (Singer Revanth) ను ఒక్కడినే గార్డెన్ ఏరియాలోకి పిలిచాడు బిగ్‌బాస్‌. ‘మునుపటి వారం మీ భార్య సీమంతం జరిగింది.. ఆ వేడుకలో మీరు స్వయంగా పాలుపంచుకోలేకపోయిన కారణంగా ఆ మధుర క్షణాలను మీకు చూపించాలని అనుకుంటున్నారు’ అంటూ రేవంత్ సతీమణి అన్విత సీమంత వేడుక వీడియోను చూపించారు బిగ్ బాస్. 

Advertisement

అయితే, ఆ వీడియో చూస్తున్నంత సేపు రేవంత్ (Singer Revanth) కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వీడియో చూడగానే క‌ప్‌ గెలిచినంత ఆనందంగా ఉందని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగతావాళ్ళనందరినీ పిలిచాడు రేవంత్. అందరు వచ్చి రేవంత్ ను హగ్ చేసుకొని అభినందనలు తెలిపారు. ఓ పళ్లెంలో స్వీట్స్, పూలు, పళ్లు పెట్టి.. వీడియోలో కనిపిస్తున్న తన భార్య నుదుటిపై బొట్టు పెట్టి, గంధం పూసి, అక్షింతులు వేసి బిగ్ బాస్ హౌస్ నుంచే ఆశీర్వదించాడు రేవంత్. ఆ తరువాత తన భార్య కోసం ఓ పాట పాడాడు. 

అనంతరం రేవంత్ బిగ్‌బాస్‌కి (Telugu Biggboss) ధన్యవాదాలు తెలుపుతూ.. షో విజేతగా నిలిచినంత ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ వేడుకలో ఇతర హౌస్ మేట్స్ కూడా పాల్గొని అతని ఆనందంలో పాలు పంచుకున్నారు. కష్టపడి గెలిచి కప్పు తీసుకెళ్లి తనకు పుట్ట‌బోయే బిడ్డ‌కు గిఫ్ట్ గా ఇస్తానంటూ చెబుతూ క‌నిపించాడు రేవంత్. తనకు కూతురు పుడితే 'రేవన్విత' అంటూ పేరు పెడతానని అన్నాడు. ఇక, చివర్లో తన భార్య కోసం 'నా కనులే కలిశా' అనే పాట పాడాడు.

Credits: Instagram
Advertisement
You May Also Like These
Advertisement