డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న తెలుగు 'బిగ్‌బాస్ సీజన్ 6' (Biggboss Season 6) సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఆసక్తికరమైన టాస్కులతో ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. కాగా, ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే హౌజ్ నుంచి షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి, చలాకీ చంటి (Chalaki Chanti) ఎలిమినేట్ అయ్యారు.
ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవ్వరూ ఊహించని విధంగా సుదీప (Sudeepa) ఎలిమినేట్ అయిపోయింది. అయితే, ఆరోవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య, రాజశేఖర్, మెరీనా నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే, ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది.. హౌస్ నుంచి బయటికి వచ్చిన తరవాత లోపల ఉన్నవారిపై సుదీప ఏం కామెంట్స్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా RRR సినిమాలోని 'నాటు నాటు' పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున (Host Nagarjuna). అస్సలు ఆలస్యం చేయకుండా మన టీవీ ద్వారా హౌస్‌మేట్స్‌ను పలకరించారు. అనంతరం హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరిమీద సెటైర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్వించారు. ముఖ్యంగా గీతూతో బాగా ఆడుకున్నారు నాగార్జున.
ఇక, ఎలిమినేషన్ ప్రక్రియలో (Elimination Process in Biggboss) భాగంగా హౌస్ మేట్స్ ను సేవ్ చేసే పనిని మొదలుపెట్టారు హోస్ట్ నాగార్జున. నామినేషన్స్‌లో ఉన్న రాజ్, సుదీప, బాలాదిత్య, గీతూ, మరీనా, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తికి బోర్డులు ఇచ్చారు. ఒక్కొక్కరు బోర్డును ఓపెన్ చేస్తే సేఫ్ అని వచ్చినవాళ్లు సేవ్ అయినట్టు. ఈ ప్రక్రియలో ఆదిరెడ్డి సేఫ్ అయ్యారు. ఇక ఆ తరవాత ‘బొమ్మలతో పాట’ అనే ఆటను హౌస్‌మేట్స్‌తో నాగార్జున ఆడించారు.
నామినేషన్స్ లో ఉన్నవాళ్ళని ముందు నుంచి ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరికి బాలాదిత్య (Baladitya), సుదీప మిగిలారు. వీరిద్దరికి రెండు బ్యాటరీలు ఇచ్చారు. ఎవరి బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున. బాలాదిత్య బ్యాటరీ ఛార్జింగ్ ఉండటం, సుదీప బ్యాటరీ ఛార్జింగ్ లేకపోవడంతో సుదీప ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.
సుదీప (Sudeepa) ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే బాలాదిత్య, మరీనా కంటతడి పెట్టుకున్నారు. అయితే, చలాకీ చంటి వెళ్లినప్పుడు కనిపించినంత హడావుడి సుదీప వెళ్లినప్పుడు కనిపించలేదు. నవ్వుతూనే సుదీప బయటికి వచ్చేశారు. ఆమెకు వెల్‌కమ్ చెప్పిన నాగార్జున.. మన టీవీలో ఆమె జర్నీని చూపించారు.
AV చూసిన తర్వాత సుదీప (Sudeepa) మాట్లాడుతూ.. నా భర్త రెండు వారల కంటే ఎక్కువగా ఉండలేవు అన్నాడు. కానీ ఆరువారాలు ఉన్నాను. హౌజ్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను అని తెలిపింది. ఆ తరవాత ఒక తోపుడు బండిపై కూరగాయలు పెట్టి, వాటి లక్షణానికి తగ్గట్టు పేర్లు పెట్టి అవి ఎవరికి సూటవుతాయో చెప్పమన్నారు. దీంతో ఒక్కొక్కరిని ఒక్కో కూరగాయతో పోల్చింది సుదీప.
Follow Us