Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ జంటగా.. సరికొత్త థ్రిల్లర్ సిరీస్ 'పులి - మేక' !

Advertisement
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).. 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ నటి అనతికాలంలోనే మంచి పాపులర్ కథానాయికగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన చోటును సంపాదించుకుంది

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).. 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ నటి అనతికాలంలోనే మంచి పాపులర్ కథానాయికగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన చోటును సంపాదించుకుంది. దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, యుద్ధం శరణం, ఏ 1 ఎక్స్‌ప్రెస్, అర్జున్ సురవరం.. లాంటి సినిమాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 

ఇటీవలే 'హ్యాపీ బర్త్ డే' అనే సినిమాకి కూడా లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సైన్ చేసింది. అలాగే నటుడు ఆది సాయికుమార్ కాంబినేషనులో కె.చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో ఈమె జీ5 ఓటీటీ సమర్పణలో ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. 'పులి - మేక' పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో నటుడు సుమన్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 

Advertisement

కోన ఫిలిం కార్పొరేషన్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సిరీస్ పూజా కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్న చక్రవర్తి రెడ్డి గతంలో గోపిచంద్ హీరోగా వచ్చిన 'పంతం' చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. 

 

ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవానికి దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాబీ తొలి షాట్‌కు క్లాప్‌ను అందించగా, అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ క్రమంలో నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ "పోలీసులను హతమార్చే ఓ సీరియల్ కిల్లర్ కథను ఆస్ట్రాలజీతో ముడిపెడుతూ ఈ థ్రిల్లర్ సబ్జెక్టును రూపొందించడం" జరిగిందన్నారు.

కళా సూర్య ఈ సిరీస్‌కు కెమెరామెన్‌గా బాధ్యతలు నిర్వర్తించగా, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందిస్తున్నారు. కోన వెంకట్‌తో పాటు కిలారు వెంకటేష్ కథా సహకారాన్ని అందిస్తున్నారు. 

Read More: "నా ఎనిమి నా కంటికి క‌నిపించ‌డు.. బ‌ట్ వాడితోనే పోరాడాలి" - బ్లాక్ ట్రైల‌ర్ అవుట్

Advertisement
You May Also Like These
Advertisement