Aanasuya bharadwaj: జబర్దస్త్ (Jabardasth) కామెడీ షోకు హాట్ యాంకర్ అనసూయ గుడ్ బై.. కొత్త యాంకర్ ఎవరంటే?

Advertisement
గత వారం ఎపిసోడ్ తోనే అనసూయ (Aanasuya bharadwaj) జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. జులై 28న ప్రసారమైన ఎపిసోడ్ అనసూయకు చివరిది కావడం విశేషం.

బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ (Jabardasth Comedy Show) అనగానే అందరికీ గుర్తొచ్చేది హాట్ యాంకర్ అనసూయ. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అనసూయ బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో అనసూయ 9 ఏళ్ళ జబర్దస్త్ ప్రస్థానం ముగిసింది.

ఈ బ్యూటీ స్థానంలో జబర్దస్త్ యాంకర్ గా కొత్త అమ్మాయి వచ్చేసింది. ఆమెను ఏకంగా పల్లకిలో తీసుకొచ్చారు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో (Jabardasth Promo) చూశాక అందరిలోనూ అనసూయను మించిన అందాలరాశి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్రోమోలో ఆ యాంకర్ ఎవరా అన్నది మాత్రం రివీల్ చేయలేదు నిర్వాహకులు.  

Advertisement

గత వారం ఎపిసోడ్ తోనే అనసూయ (Aanasuya bharadwaj) జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. జులై 28న ప్రసారమైన ఎపిసోడ్ అనసూయకు చివరిది కావడం విశేషం. అనసూయ చివరి ఎపిసోడ్ లో ఆమెపైనే స్కిట్ వేశారు జబర్దస్త్ కమెడియన్లు. జబర్దస్త్ కోసం అనసూయ ఎలా కష్టపడిందో చెబుతూనే ఆమెపై కొన్ని సెటైర్స్ కూడా వేశారు. పిల్లలను తల్లి వద్ద వదిలి కూడా జబర్దస్త్ షోకు వచ్చావ్.. అంటూ ఆమె కష్టాన్ని గుర్తు చేశారు. ఇక అనసూయను మిస్ అవుతున్నామని అంటూ జడ్జ్ ఇంద్రజ కూడా ఎమోషనల్ అయింది. 

ఇక చలాకీ చంటి.. మా కోసం నెలలో మూడు రోజులు కేటాయించలేవా? అని అడిగాడు. చిన్న పిల్లల తల్లిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళను మీ అమ్మ వద్ద వదిలి షోకి యాంకరింగ్ చేశావు. ఇప్పుడు ఏమైంది అంటూ...వెంకీ ఆమెను నిలదీశారు. విబేధాలున్నా లేకున్నా పారితోషికం కారణంగానే అనసూయ (Anchor Anasuya) జబర్దస్త్ నుండి వెళ్లిపోయారనేది మెజారిటీ వర్గాల అంచనా.

ఇదిలా ఉంటే.. ఆగస్టు 4న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో జబర్దస్త్ కొత్త యాంకర్ కనువిందు చేయనుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ యాంకర్ మంజుష (Anchor Manjusha) ఇప్పుడు అనసూయ స్థానంలో జబర్దస్త్ కి హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా రష్మీ గౌతమ్ (Rashmi Gautam) కొనసాగుతున్నారు.

Read More: వెబ్ సిరీస్ కోసం అలాంటి పాత్రలో నటించడానికి ఒప్పుకున్న హాట్ యాంకర్ అనసూయ..!

Advertisement
You May Also Like These
Advertisement