జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ (Auto Ram Prasad) హీరోగా 'పీప్ షో' మూవీ.. ఆకట్టుకుంటున్న టీజర్!

Advertisement
'పీప్ షో' మూవీ పోస్టర్ (Peep show Movie Poster)

బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో 'జబర్దస్త్' (Jabardasth) ఫేమ్ ఆటో రాంప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం 'పీప్ షో'. ఈ వినూత్న కథాచిత్రాన్ని సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్. రాజేష్ సమర్పణలో,  క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో అమి ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో నేహా దేశ్‌పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.   

Advertisement

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్‌ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను (Peep show Teaser) కూడా మేకర్స్ విడుదల చేశారు. దీనికి కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది. ఈ టీజర్‌లో గోడకు ఉన్న మేకు తీస్తూ ఆటో రామ్ ప్రసాద్ కనిపిస్తాడు.

అయితే ఆ మేకు ఊడిపోగానే, గోడకు కన్నం ఏర్పడి.. అవతలి రూమ్‌లోని అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు అతను ఆమెను దొంగచాటుగా చూడడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఈ సినిమా పేరు కూడా అదే. పీప్ షో.. అంటే దొంగచాటుగా తొంగి చూడటమే.

ఇక.. 'పీప్ షో' టీజర్ రిలీజ్ సందర్భంగా హీరో రామ్ ప్రసాద్ (Auto Ram Prasad) మాట్లాడుతూ.. "పీప్ షో" చిత్ర దర్శకుడు క్రాంతి నాకు మంచి ఫ్రెండ్. ఆయన దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా అద్దం పడుతుంది" అన్నారు.

జబర్దస్త్ సూపర్ స్టార్స్‌లో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న ఈ  చిత్రానికి, మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మూవీ మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తన మిత్రుడు క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పీప్ షో" చిత్రంతో, తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం హ్యాపీగా ఉందన్నారు సంగీత దర్శకుడు రంజిన్ రాజ్.

Read More: Extra Jabardasth: ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లో యాంక‌ర్ ర‌ష్మీ పెళ్లి.. వ‌రుడు ఎవ‌రంటే?

Advertisement
You May Also Like These
Advertisement