Telugu Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 నుంచి బిగ్ సర్ ప్రైజ్.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం.. ప్రోమో రిలీజ్!

Advertisement
బిగ్ బాస్ సీజన్‌ 6 (Bigg Boss season 6) ను కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌ చేయనున్నాడు. అతనితోనే ఈ తాజా ప్రోమోను చేశారు.

తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్(Telugu Bigg Boss). ఇప్పటికే ఐదు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా ఆరో సీజన్ కు ముస్తాబైంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ప్రారంభం కాబోయే తేదీని హాట్‌స్టార్‌ అధికారికంగా ప్రకటించింది. 'బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్' అంటూ సెప్టెంబర్ 4 (ఆదివారం) నాటి నుంచి బిగ్ బాస్ 6 వప్రారంభం కాబోతోందని ప్రోమోను విడుదల చేశారు.

ఈ లేటెస్ట్‌ ప్రోమోలో (Bigg Boss season 6 Promo).. కొందరు యువకులు గల్లీలో క్రికెట్‌ ఆడుతూ ఉంటారు. బ్యాటర్‌ రెడీగా ఉంటే.. బౌలర్‌ బౌలింగ్‌ చేయడానికి సిద్ధమవుతూ గంట కొట్టగానే అలా పరుగెత్తుకుంటూ ఇంట్లోకెళ్లిపోతాడు. వీడికేమైంది అనుకుంటూ బ్యాటర్‌ షాక్‌తో ఇటు చూసే సరికి ఎవరూ ఉండరు. 

Advertisement

ఈ లోపు మన హీరో నాగార్జున (Nagarjuna).. "అలా ఎర్రి మొహమేసుకొని సూత్తావేంటిరా అంటూ వచ్చేస్తాడు. ఇక్కడ ఆట ఆగిందంటే.. అక్కడ అసలు ఆట మొదలైనట్లే" అంటూ బిగ్‌బాస్‌ షోను అనౌన్స్‌ చేస్తాడు. లైఫ్‌లో ఏ మూమెంట్‌ అయినా బిగ్‌బాస్‌ తర్వాతే అంటూ నాగ్‌ తనదైన స్టైల్లో అదరగొట్టాడు.

కాగా, బిగ్ బాస్ సీజన్‌ 6 (Bigg Boss season 6) ను కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌ చేయనున్నాడు. అతనితోనే ఈ తాజా ప్రోమోను చేశారు. ఈ సీజన్‌ 6 ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఫ్యాన్స్‌ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో అవుతుందని కొంతకాలంగా వార్తలు వస్తున్నా.. కచ్చితమైన తేదీ తెలియలేదు. అయితే.. ఇప్పుడు మేకర్సే అఫీషియల్‌గా తేదీ వెల్లడించడంతో బిగ్‌బాస్‌ అసలు సందడి మొదలు కానుంది. కాగా, ఇప్పటికీ ఇందులో కంటెస్టెంట్లు ఎవరు అన్నదానిపై ఉత్కంఠ వీడలేదు.  

బిగ్ బాస్ సీజన్‌ 6 సెప్టెంబర్ నుంచి వంద రోజుల పాటు ఈ షో సాగనుంది. షోకి వచ్చే క్రేజ్ ని బట్టి మరో వారం రోజులు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సారి 17 లేదా 18 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో కనిపించనున్నారు. గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ షో కామన్ మ్యాన్ (Common man in Biggboss 6) కనిపించబోతున్నారు. అలానే బుల్లితెరపై అలరిస్తోన్న కొందరు సెలబ్రిటీలను ఈ షో కోసం తీసుకురాబోతున్నారు.

Read More: Biggboss Season 6: బిగ్ బాస్ సీజన్-6లో పాల్గొనే కంటెస్టెంట్ల ఫైనల్ లిస్టు ఇదే.. మరోసారి ఎంట్రీ ఇచ్చేది వీరే!

Credits: Twitter
Advertisement
You May Also Like These
Advertisement