Biggboss Season 6: బిగ్ బాస్ సీజన్-6లో పాల్గొనే కంటెస్టెంట్ల ఫైనల్ లిస్టు ఇదే.. మరోసారి ఎంట్రీ ఇచ్చేది వీరే!

Advertisement
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరేనంటూ ఒక జాబితా వైరల్ (Biggboss Season6 Contestants ListViral) అవుతోంది. చివరి నిమిషంలో కొన్ని మార్పులు ఉండవచ్చు.

తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ‘బిగ్ బాస్’ (Biggboss Season 6). సెప్టెంబరు 4వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 6 మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఐదు సీజన్లు ప్రసారమవగా... అన్ని సీజన్లు టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోయాయి. ఆ మధ్య ఓటీటీలో ప్రసారమయిన ఈ షో ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తిరిగి మళ్ళీ శాటిలైట్ రూటు తీసుకుంది.

‘బిగ్ బాస్’ అంటేనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, అరుపులు, దోస్తీ, జబర్దస్తీ.. ఇవన్నీ కామన్. చెప్పాలంటే.. ఈ షోలో అన్ని షేడ్స్ చూడొచ్చు. కానీ, ప్రేక్షకులు ఎక్కువగా వివాదాలకే కనెక్ట్ అవుతున్నారు. అన్ని సీజన్స్ కన్నా ఆరో సీజన్ కాస్తంత స్పైసీగా ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే.. వివాదాలకూ ఏమాత్రం ఢోకా ఉండదని టాక్ నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ షోలో కంటెస్టెంట్స్‌ను (Biggboss Season 6 Contestants List) ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.     

Advertisement

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్-6లో పాల్గొనే కంటెస్టెంట్లు ఫైనల్ అయ్యారట. వారందరినీ త్వరలో క్వారంటైన్ లో ఉంచబోతున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) లోనే వీరి కోసం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఇప్పటికే అదిరిపోయే లుక్ తో బిగ్ బాస్ (Biggboss Season 6) సెట్ రెడీ అయ్యిందట. సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారు. అంతకు ముందు వారం నుంచి వీరిని క్వారంటైన్ లో ఉంచుతారట. ప్రస్తుతం కరోనా ప్రభావం అంతగా లేకున్నా.. రిస్క్ తీసుకోవడం ఎందుకని నిర్వాహకులు భావిస్తున్నారట.

మరోవైపు... బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరేనంటూ ఒక జాబితా వైరల్ (Biggboss Season 6 Contestants List Viral) అవుతోంది. చివరి నిమిషంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఇంకో ఇద్దరూ లేదా ముగ్గురు కంటెస్టెంట్లు తోడు కావచ్చు 

ఈ జాబితాలో ఉన్న కంటెస్టెంట్లు ఎవరంటే.. 

1. ఉదయ భాను
2. అమర్ దీప్ చౌదరి
3. శ్రీహన్
4. దీపికా పిల్లి
5. నేహా చౌదరి
6. ఆది రెడ్డి
7. ఆర్జే సూర్య
8. నిఖిల్ విజేంద్ర
9. చలాకీ చంటీ
10. ఇనయా సుల్తానా
11. శ్రీ సత్య
12. పాండు మాస్టర్
13. అనిల్ రాథోడ్ 
14. అజయ్ కుమార్
15. మిత్రా శర్మ
16. ఆర్జే చైతు

Read More: Bigg boss Season 6: త్వ‌ర‌లో బిగ్ బాస్ సీజ‌న్ 6.. ఈసారి కంటెస్టెంట్లు ఎవ‌రంటే?

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement