Biggboss Season6: బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్ ఎవరంటే టక్కున చెప్పే పేరు సింగర్ రేవంత్. అయితే, ఆయన బిగ్ బాస్ టైటిల్ గెలవకముందే సింగర్ రేవంత్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. అసలు విషయంలోకి వెళితే... రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అన్విత స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ (Telugu Biggboss) ఇంట్లోకి రేవంత్ వచ్చే ముందే తన భార్య అన్విత గురించి చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీతో ఉందని, ఆమెను వదిలి రావడం ఇష్టం లేదని అన్నాడు రేవంత్. కానీ తనే నాకు ధైర్యం చెప్పి పంపించింది అంటూ తన భార్య గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఇక స్టేజ్ మీదే తన భార్యను చూపించి రేవంత్‌కు సర్ ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున. పుట్టబోయే బిడ్డను గర్భంలోంచి ముద్దాడిన రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. బిడ్డ పుట్టాకే తాను హౌస్ లో నుంచి బయటకు వస్తానన్నట్టుగా రేవంత్ చెప్పాడు.
మరోవైపు.. రేవంత్ (Singer Revanth) హౌస్ లో ఉన్న సమయంలోనే ఇటీవల ఆమె సీమంతం కూడా జరిగింది. ఆ వీడియోను చూసిన రేవంత్ ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి తండ్రిలేని లోటు తనకు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తున్నట్లు రేవంత్ పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు పాప పుట్టిన విషయం తెలిస్తే రేవంత్ సంతోషానికి అవధులు లేకుండా పోతాయంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
మరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రేవంత్ కు (Singer Revanth) ఈ విషయాన్ని చెప్పి బిగ్ బాస్ హ్యాపీ చేస్తాడేమో చూడాలి. గతంలో ఫ్యామిలీ టైంలో ఆదిరెడ్డి కూతురు హౌస్ లోకి వచ్చిన సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాడు రేవంత్. మరి బిగ్ బాస్ రేవంత్ కు ఈ హ్యాపీ న్యూస్ చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే రేవంత్ కు విషెస్ తెలుపుతున్నారు నెటిజన్లు.
Follow Us