తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6 (Biggboss Season 6) ప్రారంభమై విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ షో మొదటి వారాంతానికి వచ్చేసరికి మరింత ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా సండే ఫండే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వచ్చింది. హోస్ట్ నాగార్జున ఇంట్లో ఎవరికి ఎంత తెలుసు అనే ఆట ఆడించారు. అందులో కొన్ని ప్రశ్నలు అడిగి, జవాబు తెలిసిన వారు బజర్ నొక్కాలి.
మొదటగా శ్రీహాన్ (Srihan) ఇంట్లోకి వచ్చి చేసిన మొదటి పని ఏంటని అడిగాడు హోస్ట్ నాగార్జున. దానికి నేహా బజర్ నొక్కి ‘వాష్ రూమ్’ అని చెప్పింది. అది కరెక్టేనని చెప్పారు నాగ్. కాగా, ఈ విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు. ఇక షానీ పేరు వెనుకున్న కథ కూడా ఆడియెన్స్‌కు తెలిసిందే. తన ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్‌కు సంబంధించిన పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి షానీగా పెట్టుకున్నాడు.
అనంతరం ఆర్జే సూర్య (RJ Surya) ఎంతమందిని మిమిక్రీ చేయగలడు అని అడగడంతో చాలామందిని చేయగలడు అని ఇనయా చా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. దానికి హౌస్ లో ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు. ఆ తర్వాత మరో కంటెస్టెంట్ షానీ పేరులో ఫుల్ ఫామ్ ఏమిటి అని అడగడంతో కొందరు చెప్పడానికి ముందుకు వచ్చినప్పటికీ మళ్ళీ వెనుకడుగు వేశారు. దీంతో హోస్ట్ నాగార్జున వెంటనే దానికి సమాధానం ఇచ్చేశారు. శ్రీలత, హర్షిత, అనిత, నిషా, దిశ అని అన్నారు. దానికి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్స్ అక్షరాల నుంచి మొదటి అక్షరంతో ఆ పేరు వచ్చింది అని తెలియజేశాడు.
ఇక, చివర్లో బాలాదిత్యకు (Baladitya) ఇచ్చిన టాస్క్ మాత్రం ఇరుకున పెట్టేలా ఉంది. ఇంట్లోని ఆడవాళ్ల గురించి చెబుతూ అందరినీ బాలెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. శ్రీ సత్య అయితే.. శేఖర్ కమ్ముల హీరోయిన్‌లా ఉంటుందని అన్నాడు. దీంతో శ్రీ సత్య 'హైబ్రిడ్ పిల్లా' అంటూ చెప్పుకుంది. మెరినాను బుట్టబొమ్మ అని అన్నాడు. వాసంతిని బిగ్ బాస్ ఇంటి గ్లామర్‌గా అభివర్ణించాడు. గీతూ రాయల్ గురించి 'గీతూ అక్క.. సీతక్క' అని అనేశాడు.
ఇంతలో మధ్యలోకి దూరిన గీతూ రాయల్ (Geetu Royal).. నేను టెంకాయలాంటి దాన్ని.. బయటకు అలా కనిపించినా లోపల మెత్తగా ఉంటాను అని అనేసింది. అంటేనిన్ను పగలగొట్టాలన్న మాట అని నాగ్ వెంటనే కౌంటర్లు వేస్తాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు. అప్పుడు గీతూ.. పుష్ప స్టైల్లో మీ అందరికీ భలే యాపీగా ఉంది కదా? అంటూ అందరినీ వెక్కిరిస్తుంది.
Follow Us