బిగ్ బాస్ సీజన్6(BiggbossSeason6) బ్యూటీ శ్రీ సత్య (Sri Satya)కు బ్రేకప్ అయిందా.. ఆమె గురించి ఆసక్తికర విషయాలు

Advertisement
శ్రీ సత్య (Sri Satya) గతంలో పవన్ రెడ్డి (Pawan Reddy) అనే వ్యక్తిని ప్రేమించిందట. వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయ్యిందట.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో (Biggboss Season 6) కంటెస్టెంట్ గా పాల్గొన్న శ్రీ సత్య (Sri Satya) గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. ఇప్పటికే ఈ అందాలనటి 'ముద్ద మందారం', 'నిన్నే పెళ్లాడతా', 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు', త్రినయని వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది.

శ్రీసత్య 2017లో రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన 'నేను శైలజ' సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత 'గోదారి నవ్వింది', 'లవ్ స్కెచ్' సినిమాల్లోనూ కనిపించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపై సీరియల్స్‌లోకి అడుగుపెట్టింది ఈ అందాల భామ. అయితే సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన‌.. ఆమె తనదైన శైలితో ఆడుతూ బిగ్ బాస్ లో కొనసాగుతోంది. 

Advertisement

అయితే, శ్రీ సత్య (Sri Satya) తిండి మీద, నిద్ర మీద పెట్టే శ్రద్ధలో సగం ఆట మీద పెట్టాలి అంటూ నాగార్జున (Nagarjuna) కామెంట్లు చేశాడు. తోటి కంటెస్టెంట్లతో కూడా శ్రీ సత్య సరిగ్గా మాట్లాడటం లేదు అనే కంప్లైంట్ కూడా ఉంది. టాస్క్‌లు సరిగ్గా ఆడలేకపోతోంది. అలాగే హౌస్‌లో అందరితో కలవలేకపోతోంది. దీంతో ఇదే విషయాన్ని చెబుతూ మిగతా ఇంటి సభ్యులు మొదటి వారం ఆమెను నామినేట్ చేశారు. 

అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీ సత్య (Sri Satya) గతంలో పవన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించిందట. వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయ్యిందట. కానీ వీరి నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్ళలేదని.. అనూహ్యంగా వీరు విడిపోయారని తెలుస్తోంది. అయితే, వీరి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం వెనుక కారణం ఏంటి? అనే విషయం పై శ్రీ సత్య స్పందిస్తూ.. పవన్ తనను మోసం చేశాడని పేర్కొంది. 

‘ప్రేమించిన వ్యక్తితోనే నాకు ఎంగేజ్‌మెంట్‌ అయింది. అయితే మొదటి నుంచే మా కుటుంబాలకు పెళ్లి ఇష్టం లేదు. మా ప్రేమకు వారు అంగీకారం తెలపలేదు. ఇదే క్రమంలో మా రెండు కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థలు తలెత్తాయి. దీంతో మా నిశ్చితార్థం రద్దయింది’ అని చెప్పుకొచ్చిందీ బిగ్‌బాస్‌ బ్యూటీ. అయితే బిగ్‌బాస్‌ వంటి పెద్ద షోలో శ్రీసత్య తనని బ్యాడ్‌ ప్రోజెక్ట్‌ చేయడంపై ఆమె మాజీ ప్రియుడు అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

పవన్ రెడ్డి (Pawan Reddy) స్పందిస్తూ.. ఆమెది ఒక వెర్షన్ మాత్రమే.. నిజంగా మోసం చేయాలనుకుంటే పెళ్లి వరకు తీసుకొచ్చేవాడిని కాదు కదా అంటూ కూడా ఆయన తెలిపాడు. ఏదీ ఏమైనా పెళ్లి వరకు వచ్చిన పవన్ రెడ్డి, శ్రీ సత్యల పెళ్లి మధ్యలోనే ఆగిపోవడం చాలా విషాదకరమని చెప్పవచ్చు.

Read More: బిగ్ బాస్ సీజన్ 6 లో మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah).. అర్జున్ కల్యాణ్ బౌన్సర్ గా శ్రీ సత్య.. ప్రోమో వైరల్!

Credits: Instagram
Advertisement
You May Also Like These
Advertisement