Biggboss Season 6: ఆట తీరుతో టాక్ ఆఫ్ ద బిగ్ బాస్ గా మారిన ఇనయా సుల్తానా (Inaya Sultana).. టాప్ 3 లో కన్ఫమ్?

Advertisement
నోటితో పాటుగా ఆట తీరులోనూ స్పెషల్ గా మారిన ఇనయా (Inaya Sultana) ఇప్పుడు టాక్ ఆఫ్ ద బిగ్ బాస్ అయింది.

Biggboss Season 6: బిగ్ బాస్ సీజన్ 6 తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని పదోవారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో కంటెస్టంట్స్ మధ్య పోటీ పెరిగిపోతోంది. గతవారం వీకెండ్ ఎపిసోడ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన గీతూ రాయల్ (Geetu Royal) హౌస్‌ను వీడిన సంగతి తెలిసిందే. దీంతో ఇంటి సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు. ఆటలో సీరియస్‌గా లేకుంటే ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా ఇంటిదారి పట్టాల్సిందేనని అలర్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఎంత ఇష్టమైన వ్యక్తయినా సరే.. హోస్ట్ నాగార్జున కూడా ఏం చేయలేరని గీతూ ఎలిమినేషన్ తో తేలిపోయింది. 

ఇదిలా ఉంటే.. ఎప్పటిలాగే సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ (Biggboss Nominations Process) మొదలైంది. ఈ సారి నామినేట్ చేయాలనుకున్న వాళ్ళ ముఖంపై అక్కడ ఏర్పాటు చేసిన రంగు నీళ్లు పోసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పమన్నాడు బిగ్‌బాస్‌. ఈ వారం కెప్టెన్ గా ఉన్న శ్రీసత్యని నామినేషన్స్ ప్రక్రియని మొదలుపెట్టమని ఆదేశించాడు బిగ్ బాస్. ఎప్పటిలాగే ఇంటి సభ్యులంతా ఇనయాను టార్గెట్ చేశారు. అత్యధికంగా ఓట్లు ఆమెకే పడ్డాయి. ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఆమెను నామినేట్ చేశారు.

Advertisement

ఇనయా (Inaya Sultana) వంతు వచ్చేసరికి ఆమె ఫైమాను (Faima) నామినేట్ చేసింది. ఆటల్లో ఫైమా తీరును తప్పుబట్టింది. గీతూను చూసి నేర్చుకున్నావంటూ నిందించింది.  ఇనయా అలా అనడంతో ఫైమా ఒక్కసారిగా మండిపడింది. ఇకనైనా యాక్టింగ్ మానుకోమని చెప్పింది. ఆమె ఫేక్.. ఆమె ఆటతీరు ఫేక్ అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆట గురించి ఆమె మాట్లాడటం చూస్తే తనకి నవ్వు వస్తుందంటూ రెచ్చగొట్టింది. 

ఈ నేపథ్యంలో నోటితో పాటుగా ఆట తీరులోనూ స్పెషల్ గా మారిన ఇనయా (Inaya Sultana) ఇప్పుడు టాక్ ఆఫ్ ద బిగ్ బాస్ అయింది. నిన్నటివరకు గీతూ రాయల్ ఎలాగయినా కప్ గెలవాలని నోటికి పని చెప్పేది. కానీ ఇనయా ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా తన నోటితో అందరిని శత్రువులుగా మార్చుకుని, ఆటలోనూ శత్రువులను పెంచుకుంది. అలా ఇప్పుడు ఆమె టాప్ 2 కి వెళ్లగలిగే సత్తాని సంపాదించుకుంది.

నిన్నటివరకు టాప్ 2 లో సింగర్ రేవంత్ (Singer Revanth) తో పాటు.. గీతూ రాయల్ కానీ శ్రీహాన్ కానీ ఉంటారనే అభిప్రాయంలో ప్రేక్షకులు ఉండేవారు. కానీ, ఇప్పుడు గీతూ ఎలిమినేట్ కావడంతో.. శ్రీహాన్ ని (Srihan) పక్కనపెట్టి రెండవ స్థానాన్ని ఇనయాకి కట్టబెడుతున్నారు. మొదటి స్థానంలో ఉన్న సింగర్ రేవంత్ టైటిల్ అగ్రెషన్ ఆటతో ఆకట్టుకుంటుంటే... ఇనయా ఆటతోనూ, అగ్రెసివ్ తోనూ అదరగొట్టేస్తూ.. టాప్ 2లో ఉంటున్న శ్రీహాన్ కి గట్టి పోటీనిస్తోంది.

Read More: Biggboss Season 6: ఈ వారం కెప్టెన్సీ టాస్క్.. ‘స్నేక్ vs ల్యాడర్’ (Snake vs Ladder).. ఎమోషన్ అయిన కీర్తి!

Advertisement
You May Also Like These
Advertisement