చాలాకాలంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘యశోద’ (Yashoda). సమంత (Samantha) టైటిల్ పాత్రలో నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు.
భిన్నమైన కాన్సెప్ట్..
ఇతర సినిమాలతో పోలిస్తే స్కేల్ పరంగా ‘యశోద’లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఛాలెంజ్ పరంగా ఏ మాత్రం తగ్గదు. మా తొలి సినిమా ఒరు ఇరవు లో హీరో హీరోయిన్లు ఉండరు. చూసే ప్రేక్షకులే హీరో. అది పాయింట్ ఆఫ్ మూవీ కావడంతో డిఫరెంట్ ఛాలెంజ్ ఫేస్ చేశాం. హరీష్ ఫాదర్ ఆ సినిమాకు నిర్మాత. యశోద కు వస్తే భారీ స్కేల్లో చేశాం. కంటెంట్ పరంగా ఛాలెంజెస్ ఈ సినిమాకూ ఉన్నాయి. కథ పరంగా ఎప్పుడూ కొత్త పాయింట్ చెప్పాలనేది మా ఉద్దేశం. కంటెంట్ ఎలా చెబుతున్నామనేది ముఖ్యం. ఇటువంటి కథకు అంత బడ్జెట్ అవసరం కూడా, సమంత, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.
బడ్జెట్ తక్కువ..
తక్కువ నిర్మాణ వ్యయంలో సినిమా తీసేలా ఒక వెర్షన్ రెడీ చేశాం. మేం స్క్రిప్ట్ రాసేటప్పుడు సమంత గారిని దృష్టిలో పెట్టుకుని రాశాం. ఆవిడతో చేస్తామో, లేదో తెలియదు. అందుకని. తక్కువ బడ్జెట్లో చేసేలా రాసుకున్నాం. శివలెంక కృష్ణప్రసాద్ గారికి చెప్పినప్పుడు భారీ స్థాయిలో ఎందుకు చేయకూడదు? అని అడిగారు. కంటెంట్ బావుంది. గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా చేద్దాం అన్నారు. స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు అలా చేయడం సాధ్యం అవుతుంది. సమంత గారిని కలిసిన తర్వాత భారీ స్కేల్లో చేయాలనుకున్నాం. మేం ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుని కథ రాశాం. కంటెంట్ విషయానికి వస్తే ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్‌లో ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది. టెక్నికల్ పరంగా కమర్షియల్ సినిమాలా ఉంటుంది.
సరోగసీ ఒక భాగం మాత్రమే..
సరోగసీ మెయిన్ స్టోరీ కాదు. కథలో అదొక భాగమంతే, అందుకే, ఓపెన్‌గా చెప్పేశాం. సరోగసీ కంటే కథలో ఇంకా ఉంది. వార్తల్లో చూసిన, చదివిన విషయాల ఆధారంగా స్క్రిప్ట్ రాశాం. సినిమా చూసినప్పుడు మీరు షాక్ అవుతారు. సరోగసీపై వచ్చిన న్యూస్ చూసి దీనిపై మనం ఏమైనా చేద్దామా? అని అడిగాడు హరీష్. మేం కలిసి స్క్రిప్ట్ డెవలప్ చేశాం. కరోనా లాక్డౌన్లో చాలా టైమ్ లభించింది. అది చాలా హెల్ప్ అయ్యింది.
ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే..
న్యూస్ చూసి స్క్రిప్ట్ డెవలప్ చేసిన తర్వాత సస్పెన్స్ ఎలిమెంట్స్ యాడ్ చేశాం. ఆ తర్వాత స్క్రీన్ ప్లే మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. నెక్స్ట్ ఏం అవుతుంది? అనే టెన్షన్ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ సినిమాని తెలుగులో చేయడానికి కారణం మా ఫ్రెండ్, ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సెంథిల్ గారు. ఫస్ట్ వెర్షన్ రెడీ చేస్తున్న సమయంలో ఆయన ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. ఫస్ట్ వెర్షన్ విన్నాక ఒపీనియన్ కోసం కృష్ణప్రసాద్ గారికి ఫోనులో నేరేషన్ ఇచ్చారు. ఎస్పీ బాలు గారి అంత్యక్రియలకు ఆయన చెన్నై వచ్చినప్పుడు మేం కలిశాం. మా అందరికీ ఓకే అయితే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ కథ భారీ స్థాయిలో తీస్తే బావుంటుందని సెంథిల్ ఓకే అన్నారు. ఆయన తన స్వార్థం చూసుకోకుండా కథ గురించి ఆలోచించారు. కృష్ణ ప్రసాద్ గారు పాన్ ఇండియా స్థాయిలో భారీ గా తీద్దామని చెప్పడంతో అందుకు తగ్గట్టు కథ రెడీ చేసి సమంత గారికి చెప్పాం.
గ్లిజరిన్ కూడా వాడరు..
ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా సరే సమంత రెండు నిమిషాల సమయం అడుగుతారు. సెట్ అంతా సైలెన్స్ అయ్యాక ఈజీగా చేసేస్తారు. గ్లిజరిన్ కూడా వాడరు. మేం ఏం కోరుకున్నామో, అది ఈజీగా ఇచ్చేసేవారు. ప్రతి 20 నిమిషాలకు సినిమాలో ఒక మూవ్ ఉంటుంది. సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళుతుంది. సర్ప్రైజ్లు షాక్ ఇస్తాయి. మహిళలు, మాతృత్వం గురించి చెప్పాం. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఆవిడ చాలా బాగా చేశారు. మీకు ఓకేనా? వన్ మోర్ కావాలా? అని అడిగేవారు.
మాకు తెలియదు..
సమంతకి ఆరోగ్యం బాగా లేదన్న విషయం మాకు షూటింగ్ టైమ్‌లో తెలియదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేటప్పుడు మాకు ఆ విషయం తెలిసింది. ఆవిడ వల్ల ఎప్పుడూ షూటింగ్ డిస్టర్బ్ కాలేదు. ఒక స్టంట్ సీన్ అద్భుతంగా చేశారు. ఆ రోజు సాయంత్రం పేకప్ చెప్పేటప్పుడు ఆవిడకు జ్వరం ఉందని తెలిసింది. ఆవిడకు వర్క్ అంటే అంత డెడికేషన్. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని కోరుకుంటారు. యానిక్ బెన్ రెండు, వెంకట్ మాస్టర్ మూడు స్టంట్ సీన్స్ చేశారు. మేం స్క్రిప్ట్ రాసినప్పుడే యాక్షన్ సీన్స్ రాసుకున్నాం. సమంత గారు ఉండటంతో అవి ఎలివేట్ అయ్యాయి.
మెడికల్ మాఫియా..
ఇదొక మెడికల్ మాఫియా తరహా సినిమా అనుకోవచ్చు. సరోగసీ మీద చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. మాకు అది సర్ప్రైజింగ్గా ఉంది. లాక్డౌన్లో చాలా మంది పేద మహిళలు డబ్బుల కోసం తమ గర్భాన్ని సరోగసీకి ఇచ్చారు. ట్విన్స్ పుడితే వాళ్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికి కూడా వాళ్లు ఓకే అనేవారు.
సినిమా చూసి తెల్సుకోవాల్సిందే..
ఈవా అని సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు పేరు పెట్టాం. ఆ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సెంటర్ గ్రాండ్ గా ఉండాలని ఊహించుకున్నాం. దాని కోసం హైదరాబాద్ సిటీలో స్టార్ హోటల్స్ అన్నీ చూశాం. మాకు షూటింగ్ చేయడానికి కొంచెం ఫ్రీడమ్ కావాలి. స్టార్ హోటల్స్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అప్పుడు నిర్మాతను అడిగితే సెట్ వేద్దామన్నారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారితో జురాసిక్ పార్క్ లా ఉండాలని చెప్పాం. ఆయన అద్భుతమైన స్కెచ్ ఇచ్చారు. కృష్ణప్రసాద్ గారు ఖర్చు విషయంలో రాజీ పడలేదు. పాన్ ఇండియా కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలు కనెక్ట్ అయ్యేలా ఉండాలనుకున్నాం.
కాంప్రమైజ్ కాలేదు..
కథకు ఏం కావాలో అది ఇవ్వడమే కాదు, తెలుగు, తమిళ్ తెలిసిన వాళ్లను ఎంపిక చేశాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు నిర్మాత. మణిశర్మ, మార్తాండ్ కె. వెంకటేష్, సుకుమార్, ప్రతి ఒక్కరూ వంద, రెండొందల సినిమాలు చేశారు. మణిశర్మ గారు మాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. మణిశర్మ గారు అద్భుతమైన సంగీతం అందించారు.
ఆమె పాత్ర బలమైనది..
వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి జూమ్ కాల్లో స్టోరీ నేరేట్ చేశాం. ఆవిడ మౌనంగా ఉంటే మాకు ఏమీ అర్థం కాలేదు. కథ అంతా విన్నాక మీకు ఇటువంటి ఐడియాస్ ఎక్కడ నుంచి వస్తాయి? అని అడిగారు. మీకు కథ ఓకేనా? అని అడిగితే చెప్పిన కథ స్క్రీన్ మీదకు తీసుకురమ్మని అన్నారు. ఆవిడను కొత్తగా చూస్తారు.
రాజమౌళి ఇన్స్పిరేషన్తో..
కెరీర్ పరంగా మా ఇద్దరికీ ఎస్ ఎస్ రాజమౌళి గారు ఇన్స్పిరేషన్. ఆయన సినిమాల్లో పండించే ఎమోషన్స్ హృదయానికి హత్తుకుంటాయి. సమంత (Samantha)తో కలిసి కష్టపడి తెరకెక్కించిన యశోద (Yashoda) సినిమా ఎమోషనల్ థ్రిల్లర్ గా మీ అందరినీ మెప్పించాలని ఆశిస్తున్నాం అని చెప్పారు హరి, హరీష్.
Read More : అడుగు ముందుకు వేయలేనేమో అనిపిస్తోంది!.. అనారోగ్యంపై స్పందిస్తూ సమంత (Samantha Ruth Prabhu) కన్నీళ్లు
Follow Us