Mahesh Babu: మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ సినిమాలో.. విలన్‌గా విజయ్‌ సేతుపతి ?

విజయ్‌ సేతుపతి, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్‌బాబు (MaheshBabu)

స్టార్ హీరోల సినిమాల్లో విలన్లుగా.. స్టార్‌‌ యాక్టర్లు నటించడమే ప్రస్తుత ట్రెండ్. సరైన విలన్ ఉంటేనే కథానాయకుడి హీరోయిజం కూడా ఎలివేట్ అవుతుంది. అప్పుడే సినిమాను అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ తరహా ట్రెండే నడుస్తోంది. హీరో ఎంత శక్తిమంతుడో, విలన్‌ కూడా అంతే పవర్‌‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడే హీరో కెపాసిటీ ఏంటో తెలుస్తుందనేది నేటి సినీ విశ్లేషకుల అభిప్రాయం.  అందుకోసం విలన్‌ను కూడా ఈ మధ్య సినిమాల్లో పవర్‌‌ఫుల్‌గానే చూపిస్తున్నారు మన దర్శకులు.

అలా విలన్లను పవర్‌‌ఫుల్‌గా చూపించడంలో త్రివిక్రమ్‌ కూడా ఒక ఎక్స్‌పర్ట్‌. మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాల్లో కూడా విలన్లను పవర్‌‌ఫుల్‌గా, విలక్షణంగా చూపించి ప్రేక్షకులను మెప్పించాడు త్రివిక్రమ్.

ఇక చాలా సంవత్సరాల తర్వాత మహేష్‌ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లోనే ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఇదే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తోపాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది.

అయితే ఈ సినిమాలో విలన్‌గా ఒక స్టార్ యాక్టర్‌‌ను ఎంపిక చేశారట. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తమిళంలో  నటుడిగా, హీరోగా పాత్రలు చేస్తూనే, పలు సినిమాల్లో విలన్‌గా కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఈయననే త్రివిక్రమ్ విలన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Vijay Setupathi. విజయ్ సేతుపతి ఇటీవలే వచ్చిన ఉప్పెన సినిమాతో పాటు, దళపతి విజయ్‌ హీరోగా చేసిన మాస్టర్‌‌ సినిమాలోనూ  విలన్‌గా నటించాడు. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్‌ సినిమా ‘విక్రమ్’ సినిమాలోనూ విలన్‌గా నటించి ప్రశంసలు పొందుతున్నాడు. ఈ సినిమాల్లో విజయ్ సేతుపతి విలనిజానికి ఫిదా అయిన త్రివిక్రమ్.. మహేష్‌ సినిమాలో విలన్‌గా నటించడానికి ఎంపిక చేశాడని తెలుస్తోంది.

Trivikram Srinivas: త్రివిక్రమ్ ఇచ్చిన ఆఫర్‌‌కు విజయ్‌ సేతుపతి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మహేష్‌బాబు హీరోగా చేసిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే రిలీజై సూపర్‌‌హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

Read More: మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమాలో కీలకపాత్రలో కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్?

You May Also Like These