విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఎఫ్3' (F3 Movie). ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌లు కథానాయికలుగా నటించగా సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. లాజిక్స్ తో సంబంధం లేకుండా ఫన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ మేనరిజమ్స్ తో పాటు వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
అనిల్ రావిపూడి (Anil Ravipudi) గతంలో డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలతో పాటు 'ఎఫ్3'లో కొన్ని కొత్త క్యారెక్టర్లు కనిపించాయి. పూజాహెగ్డే ఐటెం సాంగ్ కూడా చేసింది. మే 27న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా... కలెక్షన్స్ పరంగా మాత్రం సత్తా చాటుతోంది. దాదాపు 70 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
ఓవర్సీస్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. దీంతో చిత్రబృందం సినిమా హిట్ అంటూ పోస్టర్లు వేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అన్నీ సీరియస్ సినిమాలే రిలీజ్ అవ్వడం కూడా 'ఎఫ్3' (F3 Movie) కి కలిసొచ్చింది. లాజిక్స్ లేని ఈ కామెడీ ఎంటర్టైనర్ ను బాగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే.. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకీ, వరుణ్‌లు ఓటీటీ విడుదల తేదీ గురించి తెలిపారు. ‘ఎఫ్-3’ చిత్రం ఇప్పట్లో ఓటీటీలోకి రాదని.. మినిమం 2 నెలల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ (F3 Movie Digital Streaming) అవుతుందని మేకర్స్ తెలిపాడు. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలన్ని నెలలోపే ఓటీటీలో సందడి చేశాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. జూలై 22 నుంచి ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సోని లివ్ లో (sony liv) స్ట్రీమింగ్ కానుంది. దాదాపు థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఎఫ్ 3 ఓటీటీలో విడుదలకాబోతుండటం గమనార్హం.
Follow Us