Rajinikanth: రజినీకాంత్‌ నటించిన 'బాబా' చిత్రం టాప్ 10 ఆసక్తికర విశేషాలు ..

Rajinikanth : రజినీ కాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12 తేదీన బాబా సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) నటనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రజినీకాంత్ డైలాగులు చెప్పే తీరు, నడిచే నడక.. ఆఖరికి కనుసైగలు కూడా ప్రేక్షకుల్లో జోష్ నింపుతాయి. ఇక తలైవా ఫైట్స్ సన్నివేశాలకు థియేటర్లు షేక్ అవుతుంటాయి. రజినీకాంత్ నటించిన సినిమాలో 'బాబా' చిత్రం ప్రత్యేకమైంది. 'బాబా' సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 

రజినీ కాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12 తేదీన 'బాబా' సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'బాబా' చిత్రం గురించిన టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం..

  1. 'బాబా' సినిమా 2002 ఆగస్టు 15 వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో రజినీకాంత్, మనీషా కొయిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. 
  2. 'బాబా' సినిమాకు కథతో పాటు స్క్రీన్‌ప్లేను రజినీకాంత్ అందించారు. అంతేకాకుండా రజినీ 'బాబా' సినిమాను స్వయంగా నిర్మించడం విశేషం.
  3. దేవుడిపై నమ్మకంలేని రజినీకాంత్‌ ఏది అనుకుంటే అది జరిగేలా హిమాలయాల్లో ఉండే సాధువు ఏడు మంత్రాలను ఉపదేశిస్తాడు. ఆ మంత్రాలను వాడిన రజినీకాంత్‌కు దేవుడిపై నమ్మకం ఎలా వస్తుందనే కథతో 'బాబా' సినిమాను చిత్రీకరించారు.
  4. రజినీకాంత్‌ (Rajinikanth)తో బ్లాక్ బాస్టర్ హిట్ 'బాషా' తెరకెక్కించిన దర్శకుడు సురేష్ కృష్ణ 'బాబా' సినిమా చిత్రీకరించారు. 
  5. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ 'బాబా' చిత్రానికి సంగీతం అందించారు. 
  6. "బాబా నీకు మొక్కుతా", "శక్తి నివ్వు.. శక్తి నివ్వు" పాటలు అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
  7. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటాకేనాయుడు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
  8. 'బాబా' సినిమాకు ఎస్.రామకృష్ణణ్ రాసిన డైలాగులు పాపులర్ అయ్యాయి. “నేను ఆలోచించకుండా మాట్లాడను.. మాట్లాడాక ఆలోచించను”, “గతం.. గతం.. అయిపోయినదాని గురించి మాట్లాడను” లాంటి డైలాగులు అద్భుతంగా రాశారు.
  9. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'బాబా' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారింది. రజినీకాంత్ అభిమానులను, ప్రేక్షకులను 'బాబా' సినిమా మెప్పించలేకపోయింది. 
  10. 'బాబా' సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా రజినీకాంత్  (Rajinikanth) పెట్టుబడిలో 25 శాతాన్ని తిరిగి వాళ్లకు ఇచ్చేశారు.

Read More: Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ టాప్ 10 చిత్రాలు.. ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిందే !

You May Also Like These