Highway Teaser: ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా తెరకెక్కిన 'హైవే'.. ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్!

తాజాగా 'హైవే' చిత్రం నుంచి టీజ‌ర్‌ను (Highway Teaser) విడుద‌ల చేశారు మేకర్స్. టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda). ‘దొర‌సాని’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు ఈ యంగ్ హీరో. ఆ త‌ర్వాత  ఓటీటీలో నేరుగా విడుద‌లైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‌’తో మంచి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. తాజాగా ‘పుష్ఫక విమానం’ సినిమాతో అలరించిన ఆనంద్.. ప్రస్తుతం ఓటీటీ వేదికగా మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.  

తెలుగు ఓటీటీ 'ఆహా' (Aha) సంస్థ నిర్మిస్తున్న ఒరిజినల్ మూవీ ‘హైవే’ (Highway) లో ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ ప‌తాకంపై వెంక‌ట్ త‌లారి ఈ చిత్రాన్ని నిర్మించాడు. అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్, మానస తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోంది. ఈ మేరకు ఆహా సంస్థ సినిమాను ఈ నెల 19 (August 19) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 

ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఇటీవలే స్పెషల్ పోస్టర్‌ను (Highway Special Poster)  రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు నిర్మాతలు. ‘118’, ‘WWW’ వంటి వినూత్న చిత్రాలను తెర‌కెక్కించిన కే.వి గుహ‌న్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. 

తాజాగా 'హైవే' చిత్రం నుంచి టీజ‌ర్‌ను (Highway Teaser) విడుద‌ల చేశారు మేకర్స్. ఈ టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ‘5 హ‌త్య‌లు.. ఎలాంటి ఆధారాలు లేవు,. ఆ అమ్మాయిల‌పై వాళ్ళ‌కు ఎందుకంత కోపం’ అంటూ వ‌చ్చే డైలాగ్ సినిమాపై విపరీత‌మైన క్యూరియాసిటీని పెంచుతోంది. అలాగే సిమోన్ కింగ్ నేప‌థ్య సంగీతం కూడా మనకు థ్రిల్ ఫీల్‌ను క‌లిగిస్తుంది. అదేవిధంగా కెమెరా విజువ‌ల్స్ కూడా ఆకట్టుకొనే విధంగానే ఉన్నాయి. 

Credits: Twitter
You May Also Like These