టాలీవుడ్ లో సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్ (Allari Naresh). ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. గతంలో బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ తో దూసుకుపోయిన అల్లరి నరేష్ కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ మహేశ్ బాబు ‘మహర్షి’తో గట్టిగా రీఎంట్రీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే గతేడాది నరేష్ (Allari Naresh) తన సేఫ్ జానర్ అయిన కామెడీని పక్కన పెట్టి.. ‘నాంది’ (Naandhi) వంటి సీరియస్ సబ్జెక్ట్‌తో వచ్చి బ్లాక్‌బస్టర్ విజయం సాధించాడు. దశాబ్ద కాలం తర్వాత ఈ సినిమాలో మళ్లీ పూర్తి స్థాయి సీరియస్ రోల్‌లో నటించాడు. ఇక, ఈ చిత్రం నరేష్‌కు కమర్షియల్‌గా మంచి బ్రేక్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). ఆనంది (Anandhi) కథానాయికగా నటిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో, హాస్య మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. ఎఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబరు 25న గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.
తాజాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam Trailer) చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో అల్లరి నరేష్ యాక్టింగ్, డైలాగ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఓ గిరిజిన ప్రాంతంలో ఉండే ఊరిలో ఎన్నికల కోసం అల్లరి నరేశ్ అక్కడికి వెళ్తాడు. అయితే అక్కడి పరిస్థితులు, అక్కడి ప్రజలను కేవలం ఓట్లుగానే చూస్తున్న సమాజంలో మార్పు తెచ్చేందుకు అల్లరి నరేశ్ ఏం చేశాడనేది మనకు సినిమా కథగా చూపించబోతున్నారు.
ట్రైలర్‌తోనే మేకర్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. ట్రైలర్ లో అబ్బూరి రవి రాసిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) మరియు ప్రవీణ్ కామిక్ హాస్య సన్నివేశాలల్లో అదరగొట్టినట్టు కనిపిస్తోంది. సంపత్ రాజ్ సీరియస్ పాత్రలో కనిపించారు.
Follow Us