టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటించిన ‘హిట్2’ (Hit 2) తాజాగా థియేటర్లలో విడుదలయ్యింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించగా నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. రిలీజ్ కి ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే, రిలీజైన తర్వాత కూడా అంచనాలకు మించి సినిమా దూసుకుపోతుంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే సన్నివేశాలతో ప్రేక్షకులను కుర్చీల్లోంచి కదలనివ్వదు. 'హిట్ 2' మూవీలో అడవి శేష్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అయితే.. ఈ మూవీ క్లైమాక్స్‌లో కనిపించిన నాని.. 'హిట్ 3'లో లీడ్ రోల్ పోషించబోతున్నట్లు డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) హింట్ ఇచ్చేశాడు.
కానీ ఇప్పుడు సడన్‌గా సమంత (Samantha) పేరు తెరపైకి వచ్చింది. వాస్తవానికి 2020లో వచ్చిన ‘హిట్’ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఆ తర్వాత ‘హిట్ 2’లో అడవి శేష్ హీరోగా చేశాడు. అలాగే వచ్చే ఏడాది రాబోతున్న 'హిట్ 3'లో నాని పేరు ఖాయమైంది. కానీ.. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషిస్తే చాలా బాగుంటుంది అని ఓ నెటిజన్ ప్రపోజ్ చేశాడు.
‘సమంత లాంటి యాక్టర్ ని, ఫ్యూచర్ 'హిట్' సిరీస్ లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి అడివి శేష్ రియాక్ట్ అవుతూ.. “అది ఒక అద్భుతమైన ఆలోచన. ఏమంటావు సమంత” అంటూ సమంతని ట్యాగ్ చేశాడు. దానికి సమంత బదులిస్తూ.. “ఓ రౌడీ పోలీస్, ఆలోచన నిజంగానే బాగుంది. ‘హిట్2’ (Hit 2) సూపర్ హిట్ అయినందుకు అభినందనలు” అంటూ రీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.
నవంబరులో విడుదలైన ‘యశోద’ (Yashoda) మూవీలో లీడ్ రోల్ పోషించిన సమంత.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. మయోసైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స తీసుకుంటూనే సమంత ఈ మూవీలో స్టంట్స్ కూడా చేసింది. దాంతో ‘హిట్ 3’ (Hit 3) మూవీలో ఆమె లీడ్ రోల్ పోషిస్తే బాగుంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సమంత చేతిలో ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘ఖుషీ’ రూపంలో రెండు సినిమాలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. హిట్ సినిమా మొత్తం 7భాగాలుగా వస్తుందని నిర్మాత నాని చెప్పకనే చెప్పారు. ఈ సినిమా మూడో పార్ట్ లో నాని నటిస్తున్న విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఈ హిట్ ఫ్రాంచైజీలో మహేష్ బాబు (Mahesh babu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి హీరోలు కూడా నటిస్తారని వార్తలు వస్తున్నాయి.
Read More: సమంత (Samantha) తాజా సినిమా 'యశోద' (Yashoda)పై కోర్టు కేసు.. ఓటీటీ (OTT) విడుదల ఆలస్యం?
Follow Us