హీరో సిద్ధార్థ్ (Siddharth), హీరోయిన్ అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari) ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలసి పలు ఈవెంట్లకు హాజరవ్వడం, చక్కర్లు కొట్టడంతో ఈ జంట నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్ మొదలయ్యాయి. అయితే ఈ వార్తలపై సిద్ధార్థ్, అదితీలు అధికారికంగా స్పందించలేదు. దీంతో దీనిపై ఏ క్లారిటీ రాలేదు.
సిద్ధార్థ్-అదితి ప్రేమ వ్యవహారంపై మళ్లీ రూమర్స్ ఊపందుకున్నాయి. అందుకు వీళ్లిద్దరూ జంటగా కెమెరాకు చిక్కడమే కారణం. తాజాగా ముంబైలోని ఓ హోటల్లో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే దానికి ఈ ఫొటోలే నిదర్శనమని నెటిజన్స్ అంటున్నారు. మరి, దీనిపై ఈ సిద్ధార్థ్-అదితి రియాక్ట్ అవుతారేమో చూడాలి.
ఇకపోతే, సిద్ధార్థ్-అదితీలు కలసి ‘మహాసముద్రం’ అనే చిత్రంలో కలసి నటించారు. గతేడాది రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమానే సిద్ధూ–అదితీలను కలిపిందట. ఈ చిత్రంతోనే వాళ్లిద్దరి మధ్య స్నేహం కుదిరిందని.. అదే ప్రేమకు దారితీసిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ జంటగా కలసి పలు ఈవెంట్లకు హాజరవ్వడం ఈ రూమర్స్‌కు ఊతమిస్తోంది.
కాగా, సిద్ధార్థ్, అదితిరావ్ హైదరీలకు ఇదివరకే పెళ్లిళ్లై విడాకులు కూడా అయ్యాయి. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే తన ఫ్యాన్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే పలు కారణాల వల్ల వీళ్లిద్దరూ 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి కూడా చిన్న వయసులోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆయనతో ఆమె విడిపోయారు. ప్రస్తుతం వీరి కెరీర్ల విషయానికొస్తే.. ‘భారతీయుడు 2’ చిత్రంలో ఓ కీలక పాత్రలో సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఇక ‘గాంధీ టాక్’ అనే ప్రయోగాత్మక చిత్రంలో అదితి యాక్ట్ చేస్తున్నారు.
Follow Us