Break Out Trailer: బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham) హీరోగా 'బ్రేక్ అవుట్'.. ఆసక్తికరంగా ట్రైలర్!

018లో 'మను' (Manu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజా గౌతమ్ (Raja Goutham) ఆ మూవీతో మంచి పేరు అందుకున్నారు.

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham) హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బ్రేక్ అవుట్' (Break Put). సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అనిల్‌ మోదుగ నిర్మిస్తున్నారు. బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

2018లో 'మను' (Manu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గౌతమ్ ఆ మూవీతో మంచి పేరు అందుకున్నారు. ఇక తాజాగా ఆయన నటించిన ‘బ్రేక్‌ అవుట్‌’ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో (Break Out FirsT Look) అందరిలో మంచి ఆసక్తిని రేపింది ఈ సినిమా. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఈ సినిమా  కాన్సెప్ట్ చాలా ఆసక్తి కలిగిస్తోందని అన్నారు. టాలీవుడ్ లో ఓ యంగ్ టీమ్ ఈ తరహా కథలతో ప్రయోగాత్మకంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. వైవిధ్యమైన కథాంశం రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్‌ కి బెస్ట్‌ విషెస్ తెలిపారు. 

కాగా, రెండు నిమిషాల నిడివి గల 'బ్రేక్ అవుట్' ట్రైలర్ (Break Out Trailer) ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లో ఈ చిత్ర కథాంశాన్ని చాలా ఆసక్తికరంగా రివీల్ చేశాడు దర్శకుడు. హీరోకు మోనో ఫోబియా అనే మానసిక రుగ్మత ఉంటుంది. అనుకోని పరిస్థితిలో ఒంటరిగా ఒక గ్యారేజ్ లో చిక్కుకుపోతాడు. ఈ ఫోబియా ఉన్న వారికి ఒంటరిగా గడపడం అంటే తీవ్ర ఆందోళనకరంగా ఉంటుంది. 

అయితే, గ్యారేజ్ లో ఒంటరిగా చిక్కుకున్న హీరో అక్కడి నుండి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? మోనో ఫోబియాతో హీరో ఎలాంటి సవాళ్ళను ఎదురుకున్నాడనేది ట్రైలర్ (Break Out Trailer) లో ఆసక్తికరంగా చూపించారు. సర్వైవల్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజా గౌతమ్ తో పాటు కిరీటి దామరాజు, చిత్రం శ్రీను, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి, రమణ భార్గవ్ తదితరులు నటిస్తున్నారు.

Read More: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ను తిలకిస్తూ, స్టేడియంలో సందడి చేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

Credits: Twitter
You May Also Like These