Kajal & Tamannaah: పాపులర్ ఛాలెంజ్ 'షీ ఈజ్ ఏ 10' లో పాల్గొన్న కాజల్ అగర్వాల్, తమన్నా.. పోస్ట్ వైరల్!

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ఓ క్రేజీ ఛాలెంజ్ లో పాల్గొని అభిమానులను అలరించారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ఓ క్రేజీ ఛాలెంజ్ లో పాల్గొని అభిమానులను అలరించారు. సోషల్ మీడియా పాపులర్ ఛాలెంజ్ అయిన 'షీ ఈజ్ ఏ టెన్'లో వీరిద్దరూ పాల్గొన్నారు. కాగా, మొదట తమన్నా ఈ ఛాలెంజ్ ని తన ఫ్రెండ్ కాజల్ కి విసరగా ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ఈ ఛాలెంజ్ కి సంబంధించిన వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

మొదట మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ఆరంజ్ కలర్ ట్రెండీ వేర్ ధరించి బాల్కనీలో కూర్చొని బుక్ చదువుతూ టీ తాగుతున్న వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి 'మిస్ బి ఈజ్ 10. ఆనందానికి కొంత అమాయకత్వం కలిపాను. నా దేశీ హృదయానికి విదేశీ ఆనందం పంచుతున్నాను. షీ ఈజ్ ఏ 10 ఛాలెంజ్ నా బెస్ట్ ఫ్రెండ్ కాజల్ అగర్వాల్ కి విసురుతున్నాను. ఈ ఛాలెంజ్ కి తన వర్షన్ చెప్పాలని కోరుకుంటున్నాను...' అంటూ పోస్ట్ చేశారు.

అనంతరం తమన్నా ఛాలెంజ్ కి స్పందించిన కాజల్ (Kajal Aggarwal) ఆమె కోరిక ప్రకారం పూర్తి చేశారు. తన ఇంట్లో ఓ సోఫాలో కూర్చొని ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన కాజల్… 'షీ ఈజ్ ఏ 10, కానీ ఆమె అమ్మ, కాబట్టి ఆమెకు పది ఇవ్వాల్సిందే. ఇది నా ఫ్రెండ్ తమన్నా కోసం..' అంటూ కామెంట్ చేశారు. ఓ తల్లిగా పరిపూర్ణత సాధించిన నేను 10 కి 10 సాధించినట్లే అన్న అర్థంలో షార్ట్ అండ్ స్వీట్ రిప్లై ఇచ్చింది కాజల్. దీంతో తమన్నా, కాజల్ ఇలా పరస్పరం స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా ద్వారా రైస్ బకెట్ (Rice Bucket Challenge), ఐస్ బకెట్, కీకీ ఛాలెంజ్ అంటూ వినూత్న ఛాలెంజెస్ వరల్డ్ వైడ్ గా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సదరు ఛాలెంజెస్ ను పూర్తి చేసి ఔత్సాహికులు వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా తమ ఫ్యాన్స్ కోసం ఇలాంటి సరదా ఈవెంట్స్ లో పాల్గొంటుంటారు. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా 'షీ ఈజ్ ఏ 10' (she’s a 10) అనే ఛాలెంజ్ విపరీతంగా వైరల్ అవుతోంది.

 

'షీ ఈజ్ ఏ 10'(she’s a 10) అనే ఛాలెంజ్ అర్థం ఏంటంటే అమ్మాయిలు తమని తాము పర్ఫెక్ట్ అంటూ ఇతరులకు వివరించడమే. అది తమ అందానికి సంబంధించిన ఎత్తు, పొడుగు, రంగు, జుట్టు, బట్టలు,శరీర అవయవాల కొలతలు వంటి బాహ్య సౌందర్యం కావచ్చు.. లేదా క్యారెక్టర్ వంటి అంత:సౌందర్యం కావచ్చు. స్కేల్ లో పది అనేది అత్యున్నత ర్యాంక్. అంటే 'షి ఈజ్ ఏ 10' అంటే… ఓ అమ్మాయి విశ్వాసంతో తనకు తాను 10 కి 10 మార్కులు ఇచ్చుకున్నట్లు. ఈ ఛాలెంజ్ సెలెబ్రిటీలకు కూడా పాకింది.

Read More: Kajal Aggarwal: మాతృత్వపు మాధుర్యాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. కొడుకు ఫొటో వైరల్!

Credits: Instagram
You May Also Like These