మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).... వీరిరువురూ టాలీవుడ్ పరిశ్రమలో డ్యాన్స్‌కి పెట్టింది పేరు. అయితే వీరి నటనతో పాటు డ్యాన్సింగ్ స్టైల్ పై మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇటీవలే పలు కామెంట్లు చేశారు.
మెగాస్టార్‌తో సినిమా చేయాలని అందరూ కలలు కంటారని, అయితే కెరీర్ ప్రారంభంలోనే తనకు ఆ అవకాశం దక్కిందని తెలిపారు దేవి. 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' లాంటి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం అనేది రావడం తన లక్ అని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) విషయానికి వస్తే 'పుష్ప' సినిమాకి అందించిన విధంగానే.. 'పుష్ప 2' సినిమాకు మంచి పాటలు అందించడానికి తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు దేవి శ్రీ.
ఇటీవలే మీడియాతో మాట్లాడిన దేవి శ్రీ ప్రసాద్ 'పుష్ప2' సినిమాతో పాటు, మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇటీవలే 'పుష్ప2' సినిమా ప్రారంభోత్సవం జరిగింది.ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెల నుంచి మొదలుకానుంది. 'పుష్ప' సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 'పుష్ప2' సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
‘పుష్ప’ సినిమా ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. 'పుష్ప 2' సినిమాను అంతకుమించి తెరకెక్కించేలా కథను రెడీ చేశారు సుకుమార్.
ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోను..
'ఏ సినిమాకి పనిచేసినా టెన్షన్ పడను. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోను. అంకితభావంతో మాత్రమే పనిచేస్తా. బెటర్ అవుట్‌పుట్ ఇవ్వడానికి కృషి చేస్తాను. ‘పుష్ప’ సినిమాకు కూడా అదే విధంగా పని చేశా.
అల్లు అర్జున్ (Allu Arjun)కి నాకు మంచి సింక్ ఉంది. ఆయన హార్డ్ వర్కర్. నేనూ అలాగే పనిచేస్తానని ఆయనకి బాగా తెలుసు' అని ఇటీవలే తన మనసులోని మాటను బయటపెట్టారు దేవిశ్రీ ప్రసాద్
కోట్లాది మందికి స్ఫూర్తి..
'మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి మాట్లాడాలంటే ఒకటి రెండు రోజులు సరిపోవు. ఆయన యాక్టింగ్, డ్యాన్స్, మంచితనం కోట్లాది మందికి స్ఫూర్తి. డ్యాన్స్‌కు కేరాఫ్ అడ్రస్ చిరంజీవి అనేలా బ్రాండ్ తీసుకొచ్చారు.
‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ సినిమాతోనే చాన్స్ వచ్చినా.. ఆయన కమ్‌బ్యాక్ సినిమా ‘ఖైదీ నం 150’కి కూడా మ్యూజిక్ చేసే చాన్స్ దొరికినందుకు నేను అదృష్టవంతుడిని. చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న మెగా154కి కూడా అదిరిపోయే ట్యూన్స్ రెడీ అవుతున్నాయి' అని చెప్పారు దేవి శ్రీ ప్రసాద్.
Follow Us