Sai Pallavi: వివాదంలో చిక్కుకున్న 'విరాటపర్వం' హీరోయిన్ సాయి పల్లవి.. క్లారిటీ ఇచ్చిన కథానాయిక !

సాయి పల్లవి (Sai Pallavi)

ప్రముఖ సినీ నటి సాయి పల్లవి (Sai Pallavi) అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఆమె తాజాగా నటించిన  'విరాటపర్వం ' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మతపరమైన కాంట్రవర్సీకి దారి తీశాయి. ఆమె మాట్లాడిన తీరుపై భజరంగ్‌‌దళ్ నాయకులు మండిపడుతున్నారు.

సాయి పల్లవి వ్యాఖ్యలను తప్పుబడుతూ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ అంశంపై కొంత మంది సపోర్ట్ చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు. అయితే, ఇదే విషయంపై సాయి పల్లవి స్పందించింది.

 'నేను చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా సమాధానం చెబుతా. కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు ఏం మాట్లాడినా.. అదేదో సినిమా ప్రమోషన్ కోసం చేశానని అనుకుంటారు ' అంటూ సాయి పల్లవి రియాక్ట్ అయింది. ఆమె స్పందించిన తీరు చూస్తుంటే, ఆమె వద్ద ఏదో బలమైన వివరణ ఉండే ఉంటుందని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ఆమె అభిమానులు.

ఇక ఈ వివాదం నుంచి  'నన్ను సేవ్ చేయాలని నా అభిమానులు ప్రయత్నిస్తున్నారని తెలుసు. విరాటపర్వం (Virataparvam) విడుదల తర్వాత ఈ వివాదంపై మాట్లాడతా ' అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. 

కాగా, నేడు జూన్ 17 విరాటపర్వం మూవీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి మళ్ళీ ఎప్పుడు ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంది? ఏమి చెప్పబోతోంది? అనేది చర్చనీయాంశం అయింది.

ఇకపోతే ఈ రోజే విడుదలైన విరాటపర్వం మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో వెన్నెలగా సాయి పల్లవి, రవన్నగా రానా (Rana) అదరగొట్టే పర్‌ఫార్మెన్స్ కనబర్చారని ప్రేక్షకులు అంటున్నారు.

చిచ్చు రేపిన వ్యాఖ్యలివే...
విరాటపర్వం సినిమా ప్రమోషన్‌లో (Virataparvam Promotions) భాగంగా ఈ నెల 12న సాయిపల్లవి ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఓ సందర్భంలో మాట్లాడుతూ..‘ ఎవరు కరెక్టు, ఎవరు తప్పు అనేది మనం చెప్పలేం. కొద్ది రోజుల క్రితం కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా వచ్చింది కదా.. ఆ సమయంలో కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో అందులో చూపించారు కదా.

 మీరు దానిని రెలీజియస్‌ కాన్‌ఫ్లిక్ట్‌గా తీసుకుంటే.. కొవిడ్‌ టైమ్‌లో ఎవరో ఒక బండిలో ఆవును తీసుకెళుతున్నారు. ఆ బండి డ్రైవ్‌ చేసే ఆయన ముస్లింగా ఉన్నారు. కొందరు ఆయనను కొట్టి జై శ్రీరామ్‌ అని చెప్పారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏం ఉంది ? కనుక ఇప్పుడు మనం మతం పేరుతో  మంచిగా ఉండాలి. మనం మంచి వ్యక్తులుగా ఉండి ఉంటే హర్ట్‌ చెయ్యం. ఎదుటి వ్యక్తిని ఒత్తిడికి గురిచేయం’ అని వ్యాఖ్యానించారు. ఇవే వ్యాఖ్యలే ఆమెను అనుకోని వివాదంలోకి లాగడం గమనార్హం.

Read More: Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ ఎపిసోడ్ లో మెరిసిన రానా, సాయి పల్లవి!

You May Also Like These