Rules Ranjann First Look: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఫస్ట్ లుక్ రిలీజ్!

‘రూల్స్ రంజన్ ’ మూవీ పోస్టర్, కిరణ అబ్బవరం (Rules Ranjann Movie Poster, Kiran Abbavaram)

'రాజావారు రాణిగారు', 'ఎస్.ఆర్.కళ్యాణ్ మండపం' సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పుడు వరుసబెట్టి కొత్త సినిమాలను ప్రకటిస్తూ. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నారు ఈ కుర్ర హీరో.  ఇటీవలే 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. 

ఈ చిత్రం సక్సెస్ అయ్యాక, ఇక వరుసపెట్టి సినిమాలు చేస్తూ కిరణ్ ఎంతో బిజీగా మారారు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా సినిమా ‘రూల్స్ రంజన్’. 'ప్రేమకి మాత్రం నో రూల్స్' అనేది ట్యాగ్ లైన్. ఇటీవల ఆయన బర్త్‌ డే సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. 

‘రూల్స్ రంజన్ ’ (Rules Ranjann) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గనుక ఒకసారి పరిశీలిస్తే, కిరణ్ అబ్బవరం బిజినెస్ మ్యాన్ సూట్‌లో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. తను ఇంతవరకు మాస్ మసాలా సినిమాలే ఎక్కువగా చేసినప్పటికీ, క్లాస్ పీపుల్స్‌ను కూడా ఈ కొత్త లుక్‌లో ఆకట్టుకున్నాడు.ఇప్పుడు మాస్ టచ్‌తో పూర్తి క్లాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనిపిస్తోంది.  బ్యాక్ గ్రౌండ్‌లో రాసున్న రూల్స్ ని బట్టి చూస్తే రూల్స్ పేరుతో ఎంప్లాయిస్‌ని ఇబ్బంది పెట్టే బాస్ క్యారెక్టర్ అనిపిస్తుంది. 

ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్‌, స్టార్‌ లైట్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘డిజె టిల్లు’ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్‌ నేహా శెట్టి (Neha Shetty) కథానాయికగా నటించనుంది.

ఇంకా వెన్నెల కిషోర్‌, హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్‌, సత్య.. బాలీవుడ్ నటులు అన్ను కపూర్‌, సిద్ధార్థ సేన్‌, అతుల్‌ పర్చురే, ఆశిష్‌ విద్యార్థి వంటి నటీనటులతో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రూల్స్ రంజన్ ’ (Rules Ranjann) సినిమాకు  అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌‌గా దులీప్ కుమార్, ఎడిటర్‌గా వరప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

Read More: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'.. ఆకట్టుకుంటున్న టీజర్!

You May Also Like These