Actor Prudhvi Raj: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న 'థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ' పృథ్వీ రాజ్ కుమార్తె శ్రీలు..!

నటుడు పృథ్వీ రాజ్ కుమార్తె 'కొత్త రంగుల ప్రపంచం' మూవీ పోస్టర్ (Kotha Rangula Prapancham Movie Poster)

టాలీవుడ్ లో తనదైన కామెడీ టైమింగ్ తో ఓ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న న‌టుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ (prudhvi raj). శ్రీకాంత్ హీరోగా నటించిన 'ఖడ్గం' సినిమాలోని 'థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ' అనే డైలాగ్ చెప్పి అదే పేరుతో గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీ. టాలీవుడ్ లోని స్టార్ హీరోల‌ను అనుక‌రిస్తూ ఆయన చేసే కామెడీ వేరే లెవ‌ల్ అంతే. ఈ క్రమంలో పృథ్వీరాజ్ 'లౌక్యం' సినిమాలో చేసిన కామెడీ అంతా ఇంతాకాదు. ఈ సినిమా కంటే ముందు చాలా సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఈ సినిమాతో ఆయనకు ఎంతో పాపులారిటీ వ‌చ్చింది.  

నటుడు పృథ్వీరాజ్ (prudhvi raj) ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కుమార్తె త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనే సీక్రెట్ బయట పెట్టాడు. 'నా కుమార్తె కూడా త్వరలో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. నన్ను ఎలాగైతే సినిమాల్లో ఆదరించారో.. నా కూతురిని కూడా అలాగే ఆదరించండి' అంటూ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశాడు ఈ కమెడియన్. 

ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా మాట్లాడుతూ... మా అమ్మాయి పేరు శ్రీలు (Sree Lu), సినిమాల్లోని అనేక సన్నివేశాలు చూసి అనుకరిస్తూ వీడియోలు చేస్తూ ఉంటుంది. నటనపై ఎంతో తనకు ఆసక్తి. యాక్టింగ్, డాన్స్ కూడా నేర్చుకుంది. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు కూడా పూర్తి చేసింది. కానీ నటన మీద ఆసక్తితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. చాలా గ్రాండ్ గా టాలీవుడ్ కి మా అమ్మాయిని పరిచయం చేద్దాం అనుకున్నా. కానీ అది కుదరలేదు. 'కొత్త రంగుల ప్రపంచం' అనే సినిమాతో మా అమ్మాయి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. నా స్నేహితుని కుమారుడు క్రాంతి ఈ సినిమాలో హీరో. అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్.

అయితే ఈమధ్య సినిమాలకు దూరం అయ్యాడు ఈ 30 ఇయర్స్ స్టార్ (30 Years Industry). పాలిటిక్స్ లో కి వెళ్లిన ఈ స్టార్ కమెడియన్స్ కు.. అక్కడ సెటిల్ అవుతున్న టైమ్ లోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దాంతో అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు దూరం అయ్యాడు. ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేకపోవడంతో.. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాడు. 

Read More: Samantha: బాలీవుడ్ లో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన సమంత.. స్టార్ హీరో సరసన అవకాశం!

You May Also Like These