Actress Pranitha: బిడ్డ పుట్టాక ట్రెండీ గౌనులో హీరోయిన్ ప్రణీత ఫొటోషూట్.. ఫొటోలు వైరల్!

కూతురితో హీరోయిన్ ప్రణీత (Pranitha with her Baby)

టాలీవుడ్ బాపు బొమ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరోయిన్ ప్ర‌ణీత‌ (Heroine Pranitha).. ఇటీవ‌లే ఓ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంకా ఆ ఆనందంలోనే మునిగి తేలుతోంది ఈ బ్యూటీ. అయితే, కొద్ది రోజులు అభిమానులకు దూరంగా ఉన్నఈ అమ్మడు, తాజాగా క్యూట్ ఫొటోషూ‌ట్‌‌తో దర్శనమిచ్చింది.

అంతుకుముందే కూతురిని పొత్తిళ్ల‌లోకి తీసుకున్న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి, ఓ శుభ‌వార్త‌ను అభిమానుల‌తో పంచుకుంది. 'పాప పుట్టిన‌ప్ప‌టి నుండి.. అంతా క‌ల‌గా అనిపిస్తోంది' అంటూ పోస్ట్ పెట్టింది.

ప్ర‌ణీత షేర్ చేసిన తాజా ఫొటోషూట్‌ చిత్రాలలో.. ఈ బ్యూటీ గతంలో కంటే కొత్తరకం జోష్‌తో అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఆరోగ్యంగానూ, గ్లామరస్‌గానూ కనిపిస్తోంది.

ఓ టేబుల్ పై కూర్చున్న ప్రణీత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలకు ఫోజులివ్వడం విశేషం. ఓ ఫోటోలో ప్రణీత పూల గౌన్‌లో మరింత అందంగా మెరిసిపోతోంది. అలాగే మిగతా ఫొటోలలో కూడా క్యూట్‌గా ఫోజులిస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోందీ బ్యూటీ. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ బాగా వైరల్ (Pranitha Photoshoot Viral) అవుతున్నాయి. 

కాగా, బెంగ‌ళూరుకు చెందిన వ్యాపార‌వేత్తతో ప్ర‌ణీత‌కు గత ఏడాది పెళ్లి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ నెల‌లో ప్ర‌ణీత త‌న ప్రెగ్నెన్సీ (Praneetha Pregnency) విష‌యాన్ని బయటకు వెల్ల‌డించింది. తాను ప్రెగ్నెన్సీ టెస్టులు చేయించుకున్నానని చెబుతూ.. స్కానింగ్ రిపోర్టుల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. తాను త‌ల్లి అవుతున్న‌ట్లు ప్రకటించింది. అనంతరం ప్ర‌ణీత పోస్టు చేసిన సీమంతం వేడుక‌ చిత్రాలు, బేబీ ష‌వ‌ర్ ఫోటో షూట్లు ఎంత‌గా వైర‌ల్ అయ్యాయో అంద‌రికీ తెలిసిందే.

కాగా, ఈ బ్యూటీ ఒకప్పుడు తనకు ఎంతో ఇష్టమైన మోడలింగ్‌ను ఎంచుకొని, మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన 'పోకిరి' (Pokiri Movie) సినిమాకు కన్నడ రీమేక్ అయిన ‘పోర్కి’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం టాలీవుడ్‌కు మాత్రం ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ‘పోర్కి’ హిట్ తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో నటించిన ‘బావ’ చిత్రం ప్రణీతకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. 

ఇక, వెంటనే పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించి బుట్టబొమ్మగా పేరొందింది. అనంతరం వచ్చిన ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో యంగ్ హీరో రామ్ సరసన నటించి మరింత క్రేజ్ పెంచుకుంది.

Read More: Natural Star Nani: భాషలు వేరైనా జాతి ఒకటే.. పాన్ ఇండియా అనేది 'స్టుపిడ్' : నాని

You May Also Like These