మెగా 'అభయం' : క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానికి లేఖ రాసిన 'చిరంజీవి (Megastar Chiranjeevi) !

‘నేనెప్పుడూ మీకు అండగా ఉంటాను’ అని స్వయంగా ఓ అభిమానికి చిరు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ (Chiranjeevi Letter Viral) అవుతోంది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఎంతోమందికి సహాయం చేసి హీరో అనిపించుకుంటున్నారు. తాజాగా ఓ అభిమానికి లేఖ రాసి భరోసా ఇచ్చారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానికి లేఖ ద్వారా ధైర్యాన్ని నింపడంతో పాటు, అతని ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షల రూపాయల చెక్కును పంపించి తన ఉదారతను చాటుకున్నారు.

వైరల్ అవుతున్న లెటర్

కృష్ణాజిల్లా పెడన నియోజక వర్గానికి చెందిన దొండపాటి చక్రధరరావు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలుసుకున్న చిరు ఆయన్ని హైదరాబాద్‌కు పిలిపించి.. ఓ పెద్ద ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందేలా ఏర్పాటు చేశారు. అంతే కాదు ‘నేనెప్పుడూ మీకు అండగా ఉంటాను’ అని స్వయంగా ఆ అభిమానికి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ (Chiranjeevi Letter Viral) అవుతోంది.  

'డియర్‌ చక్రధరరావు.. మీరు నా పేరు మీద ఇప్పటివరకు పేద ప్రజలకు చేసిన సేవలు వర్ణనాతీతం. అవన్నీ చూసి నేను చాలా ఆనందపడ్డాను. మీరు అనారోగ్యంగా ఉన్నారని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను. త్వరలోనే మీరు కోలుకుని ఎప్పటిలాగే ప్రజా సేవలో నిమగ్నమవుతారని ఆశిస్తున్నాను. నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటాను.


 

రూ. 5 లక్షల చెక్ అందజేత

ప్రస్తుతానికి సర్జరీ కోసం.. అలాగే మెరుగైన వైద్యం కోసం రూ.5 లక్షల చెక్కు పంపిస్తున్నాను. మరొకసారి మీకు నా అభినందనలు. ఎన్నో కార్యక్రమాలు నా పేరు మీద చేసి ఆదర్శంగా ఉన్నారు. త్వరలో పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులకు నా నమస్కారములు తెలుపగలరు..' అంటూ చిరంజీవి (Megastar Chiranjeevi) తన అభిమానికి లేఖ రాశారు.

కాగా ఇటీవలే చక్రధర్‌ను హైదరాబాద్ పిలిపించి ఒమెగా హాస్పిటల్‌లో జాయిన్ చేయించారు చిరు. అంతేకాకుండా స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) చేసే సేవలకు ప్రత్యక్ష నిదర్శనం  ’బ్లడ్‌ బ్యాంక్‌’, ఐ బ్యాంక్‌’, ఆక్సిజన్‌ బ్యాంక్‌. ఇవి బయటకు తెలిసినవి. బయటకు తెలియకుండా చేసే గుప్తదానాలు ఎన్నో. ఎవరైనా ఆపదలో ఉంటే.. నేనున్నాంటూ సాయం అందించడానికి ముందుకొస్తారు చిరంజీవి.

Read More: Megastar Chiranjeevi: మెగాస్టార్ సినిమా 'అడవి దొంగ' చూపిస్తూ బామ్మకు సర్జరీ.. చిరంజీవి స్పందన ఇదే!

 

Credits: pinkvilla
You May Also Like These