God Father First Look: మెగా అభిమానులకు గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమానులకు గూస్‌బంప్స్ ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఇందులో (GodFather Movie) చిరంజీవి లుక్ అదిరిపోయేలా ఉండటం విశేషం. సరికొత్త లుక్‌లో చిరు నెవర్ బిఫోర్ అనేలా ఉన్నారు. తలపై కాస్త నెరిసిన జుట్టు, పక్కకి చూస్తున్న ఇంటెన్స్ లుక్, చైర్‌లో దర్జాగా కూర్చున్న తీరు వాహ్ అనిపిస్తోంది.
ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తెల్లజుట్టుతో కనిపిస్తున్నారు. కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించారు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక, ఈ పోస్టర్ తో పాటు చిన్న వీడియో కూడా వదిలారు. ఇందులో చిరు ఎంట్రీ సీన్ అదిరిపోయింది. చిరుతో పాటు కారులో వచ్చి.. ఆయన కారు డోర్ తీస్తూ కనిపించారు నటుడు సునీల్. చిరు వెంటే ఉండే క్యారెక్టర్ అని తెలుస్తోంది.
ఇక, ఈ వీడియోలో సంగీత దర్శకుడు తమన్ (SS Thaman) బీజీఎం అదిరిపోయింది. చిరుకు తగ్గట్టు తమన్ మ్యూజిక్ అందించాడు. మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదలతో మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకాయి. సోషల్ మీడియా వేదికగా విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, యాంకర్ అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ఏడాది విజయదశమికి గాడ్ ఫాదర్ మూవీ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా, చిరంజీవి ఇప్పటివరకు అనేక యాక్షన్ చిత్రాలు చేశారు, కమర్షియల్ మాస్ మసాలా మూవీస్ చేశారు. ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, కామెడీ సినిమాలు కూడా చేశారు. కానీ ఇలాంటి డార్క్ సైడ్ నేపథ్యంతో కూడిన చిత్రాలు చేయలేదు. ఇందులో చిరంజీవి రాజకీయాలను తెరవెనుక నుంచి శాషించే మాఫియా నాయకుడిగా కనిపించబోతున్నారు. కాగా, ఈ మూవీని సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ (Konidela Productions Company), సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక, ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించగా, పృథ్వీరాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషించారు. మలయాళ 'లూసిఫర్'లో (Lucifer Movie) మోహన్ లాల్ వైట్ కలర్ పంచ్, షర్ట్ తో కనిపిస్తే.. రీమేక్ లో చిరు మాత్రం తెలుగు ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా డ్రెస్ చేసుకున్నారు.
Follow Us