Allu Arjun: రకుల్ నటించిన 'మషూక' (Mashooka Music Video) మ్యూజిక్ వీడియో.. అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల!

రకుల్ (Rakul) నర్తించిన ‘మషూకా’ అనే వీడియో సాంగ్ ను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తెలుగు, తమిళ వెర్షన్‌లలో రిలీజ్ చేశారు.

Rakul Preeth Singh: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో రకుల్ ప్రీత్ సింగ్. ఆమె తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ తాజాగా ఓ మ్యూజిక్ సాంగ్‌లో నటించింది. ‘మషూకా’ (Mashooka) అనే టైటిల్‌తో ఈ వీడియో సాంగ్ రూపొందింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పాటను తెలుగు, తమిళ వెర్షన్‌లలో రిలీజ్ చేశారు.

ఈ మేరకు అల్లు అర్జున్ (Allu Arjun) సోషల్ మీడియాలో.. "నాకు ఇష్టమైన రకుల్‌ ప్రీత్‌తో పాటు టీమ్‌ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకు ఇష్టమైన మొదటి మ్యూజిక్ వీడియో మషూకాను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది మీ అందరి హృదయాలను తాకుతుందని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 

కాగా, త‌నిష్క్ బాగ్చీ స్వరకల్పన లో ఆశీష్ కౌర్ , దేవ్ నేగి గానం చేసిన, డింపుల్ కొటేచా కొరియోగ్ర‌ఫీలో “మషూక” (Mashooka) మ్యూజిక్ వీడియో కు రకుల్ అద్భుతంగా డ్యాన్స్ పర్ఫార్మ్ చేశారు. అయితే, ఆ మ్యూజిక్ వీడియో ఇప్పటికే హిందీ భాషలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. గతంలోనూ రష్మిక మందన్నా (Rashmika Mandanna), మాళవిక మోహనన్ తదితర ముద్దుగుమ్మలు ఇలాంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నర్తించారు. కానీ, అవేమీ ఇప్పటివరకు తెలుగులో రిలీజ్ కాలేదు. కానీ, రకుల్ ఈ పాటను తెలుగు,తమిళ భాషల్లో సైతం రిలీజ్ చేసి, బాగా ప్రమోట్ చేస్తోంది. 

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆమె కథానాయికగా తెరకెక్కిన 'డాక్టర్‌ జీ','థ్యాంక్‌ గాడ్‌', 'మిషన్ సిండ్రెల్లా', 'చ్ఛాత్రివాలి' (హిందీ), శివ కార్తికేయన్ 'అయలాన్' (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీలోనూ రకుల్ నటిస్తున్నారు.

ఇక ఈ వీడియో సాంగ్ లో రకుల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రకుల్ మంచి డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సాంగ్‌లోనూ చాలా బాగా డాన్సులేసింది. స్టెప్పులు కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. కాస్ట్యూమ్స్ కూడా సరికొత్తగా ఉన్నాయి. అందుకేనేమో  ‘మషూకా’ (Mashooka Video Song) నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.

Read More: ర‌కుల్ ప్రీత్ సింగ్‌ అస్సలు తగ్గడం లేదుగా.. అందాల విందు చేస్తున్న బ్యూటీ!

You May Also Like These