SS Rajamouli: 'సై' సినిమాకు ఫస్ట్ హీరో నితిన్ కాదా ? రాజమౌళి ఆఫర్‌ను ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేశారా?

హీరో నితిన్, ఉదయ్ కిరణ్, డైరెక్టర్ రాజమౌళి (Hero Nithin, Hero Uday Kiran, Director SS Rajamouli)

ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియాలోనే ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) టాప్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హీరోలందరూ భావిస్తుంటారు. అయితే, రాజమౌళి మాత్రం తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. ఒకరకంగా, వాళ్లను పాన్ ఇండియా స్టార్స్‌గా తీర్చిదిద్దుతుంటాడని చెప్పవచ్చు.

ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వచ్చింది.ఇప్పటివరకు ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్‌లు అందించి, కెరీర్‌ను నిలబెట్టాడు రాజమౌళి. ఇక ఎన్నో సినిమాలతో, అటు యూత్‌కి కూడా బాగా దగ్గరయ్యాడు. 

ఇటీవలే ఈ దర్శకధీరుడు ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. కాగా, రాజమౌళి ఆఫర్‌ను మిస్ చేసుకున్న హీరోలు కూడా కొంతమంది ఉన్నారు. ఆ జాబితాలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కూడా ఉండటం గమనార్హం.

రాజమౌళికి పెద్దగా క్రేజ్ లేని సమయంలో, నితిన్ హీరోగా 'సై'  సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పైగా ఇదే సినిమా యూత్‌కి కూడా బాగా కనెక్ట్ అయింది.

అయితే.. ఈ సినిమా ముందుగా ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్లిందట. కానీ, అప్పటికే ఫుల్ బిజీగా ఉన్న ఉదయ్ కిరణ్.. రాజమౌళి ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడట. దాంతో  కాస్త అటు, ఇటుగా ఉదయ్ కిరణ్ పోలికలు ఉండే నితిన్ (Hero Nitin) తో సినిమాకు రెడీ అయిపోయాడు రాజమౌళి.

అలా ఆ స్టోరిని నితిన్ వెంటనే ఓకే చేయడం, సినిమా తెరకెక్కడం జరిగిందట. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఇక ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేసిన 'సై' సినిమాలో హీరో పాత్ర పోషించిన నితిన్, ఆ క్యారెక్టర్‌లో ఎంతలా ఒదిగిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

అయితే ఈ సినిమాను మిస్ చేసుకున్న తర్వాత ఉదయ్ కిరణ్ (Hero Uday Kiran) చాలా బాధపడ్డారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి జరగడం సర్వసాధారణం. ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా.. మరో హీరో వద్దకు వెళ్లడం.. ఆ హీరో సూపర్ హిట్ అందుకుని సక్సెస్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది

Read More: Jayam Movie: నితిన్ తొలి సినిమాకి 20 ఏళ్లు ! 'జయం' అప్పట్లో ఓ సంచలనం !

You May Also Like These