Dasara: నాచురల్ స్టార్ నాని (Nani) సినిమా 'ద‌స‌రా'కు అంత డిమాండా !

హీరో నాని (Nani) న‌టించ‌బోయే మొద‌టి పాన్ ఇండియా సినిమా 'ద‌స‌రా'.

టాలీవుడ్‌లో హీరో నాని (Nani) కొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తారు. 'అంటే.. సుంద‌రానికీ' చిత్రంలో న‌టించిన నాని ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు పొందారు. 'అంటే.. సుంద‌రానికీ' త‌ర్వాత నాని ద‌స‌రా సినిమాలో న‌టిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా ద‌ర్శ‌క‌త్వంలో 'ద‌స‌రా' పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.  

ద‌స‌రా నానికి ప్ర‌త్యేకం
'ద‌స‌రా' (Dasara) చిత్రం పూర్తి స్థాయి యాక్ష‌న్ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హీరో నాని న‌టించ‌బోయే మొద‌టి పాన్ ఇండియా సినిమా 'ద‌స‌రా'.  ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నార‌ట‌.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ద‌స‌రా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నానికి జంట‌గా కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. కీర్తి సురేష్ పాత్ర కూడా స‌రి కొత్త‌గా వెండితెర‌పై క‌నిపించ‌నుంది. 

విల‌నిజంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని 'ద‌స‌రా' చిత్రానికి మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నారు. ఈ సినిమాలో సాయి కుమార్, జరీనా వహాబ్. రోషన్ మాథ్యూలు న‌టించ‌నున్నారు. సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ద‌స‌రాకు పెరిగిన డిమాండ్
నాని (Nani) న‌టిస్తున్న 'ద‌స‌రా' సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంత వ‌ర‌కు పూర్తియింది. మ‌రో కొత్త షెడ్యూల్ జ‌రుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 'ద‌స‌రా' నాన్ థియేట్రికల్ రైట్స్ వ‌సూళ్లు అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నాయి. ఓటీటీ, హిందీ, శాటిలైట్ అన్నీ కలుపుకొని దాదాపు రూ. 47 కోట్లు ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఈ ఆఫ‌ర్‌కు నిర్మాత‌లు కూడా ఓకే చెప్పార‌ట‌. 'ద‌స‌రా' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

నాని సినిమాకు భారీ సెట్లు
గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 'ద‌స‌రా' క‌థను శ్రీకాంత్ ఓదెల చిత్రీక‌రించ‌నున్నారు. హీరో నానిని మాస్ క్యారెక్ట‌ర్‌లో వెండితెర‌పై ఓ రేంజ్‌లో చూపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జ‌రుగుతుంది. 

'ద‌స‌రా' షూటింగ్ కోసం ఓ భారీ సెట్ వేశార‌ట. ప‌ల్లెటూరికి సంబంధించిన సెట్‌ను అద‌ర‌హో అనిపించేలా రూపొందించారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన నాని (Nani) ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. 

Read More: Nani : నాని నటిస్తున్న 'దసరా ' సినిమా మీద పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు !

You May Also Like These