టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్‌బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్-రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలుపెట్టిన జక్కన్న (SS Rajamouli) ఈ క్రేజీ ప్రాజెక్టును వచ్చే ఏడాది నుంచి ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపుదిద్దుకోనుంది. ఇప్పటివరకు జక్కన్న తెరకెక్కించిన చిత్రాలకు మించి ఉంటుందని స్వయంగా రాజమౌళి చెప్పడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అయితే కొద్దిరోజులుగా ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట వైరలయ్యాయి.
తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) ఈ సినిమా గురించి కీలక విషయం బయటపెట్టాడు. ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రాబోతున్నట్టు అయన వెల్లడించాడు. ఇదోక అడ్వెంచర్ స్టోరీ అని.. వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుందని తెలిపారు. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
అలాగే ఇటీవల టోరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న జక్కన్న కూడా తాను మహేష్ బాబుతో (Mahesh Babu) తీయబోయే సినిమా గురించి పెదవి విప్పారు. మహేష్ తో తాను తీసే సినిమా జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ తరహాలో అడ్వంచరస్ గా ఉంటుందని తెలిపారు. మరోవైపు ఈ చిత్రంలో కథానాయికగా దీపికా పదుకొణె (Deepika Padukone) ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Follow Us