రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna): కడుపుబ్బా నవ్విస్తున్న 'ఇంటింటి రామాయణం' టీజర్ (Intinti Ramayanam)!

'ఇంటింటి రామాయణం' టీజర్ (Intinti Ramayanam Teaser) చూస్తుంటే.. అన్ని ఎమోషన్స్‌ కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది.

Intinti Ramayanam Teaser: తెలుగులో తొలి ఓటీటీ సంస్థ అయిన 'ఆహా' (AHA Ott) తనదైన స్టైల్లో వెబ్‌సిరీస్‌, సినిమాలతో దూసుకుపోతోంది. గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా ప్రేక్షకులకు తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ ఓటీటీ రంగంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది ఆహా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎన్నో వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను అందించి వారి సంతోషంలో భాగ‌మైంది.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ 'ఆహా'తో చేతులు క‌లిపింది. వీరి కాంబినేష‌న్‌లో రూపొందిన తెలుగు ఒరిజిన‌ల్ ఫిల్మ్ ‘ఇంటింటి రామాయణం’ (Intinti Ramayanam). రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీ టీజర్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంతో సురేష్ నరెడ్ల దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. 

డైరెక్టర్ మారుతీ పర్యవేక్షణలో.. సురేష్ దర్వకత్వంలో తెరకెక్కిన 'ఇంటింటి రామాయణం' ఆహా వేదికగా డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ  సందర్భంగా తాజాగా చిత్ర టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. రాహుల్ రామకష్ణ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో పలు సీరియల్స్ లో కనిపించిన నవ్య స్వామి అలరించనుంది. గంగవ్వ, బిత్తిరి సత్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

'ఇంటింటి రామాయణం' టీజర్ (Intinti Ramayanam Teaser) చూస్తుంటే.. అన్ని ఎమోషన్స్‌ కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. మధ్యతరగతి కుటుంబాలలో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. "మీరసలు హైలైట్‌ అన్నా.. మీ అసుంటి గొప్ప ఫ్యామిలీ ఏ ఊళ్లో కూడా ఉండదు తెలుసా" అనే బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌తో ఈ టీజర్‌ మొదలవుతుంది. "అసలు ఏం ఫ్యామిలీ రా మీది.. ఒక్కొక్కడికి ఒక్కో చరిత్ర ఉంది" అని పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ డైలాగ్‌తో ముగుస్తుంది. మొత్తానికి టీజర్‌ మూవీపై ఆసక్తి రేపేలా సాగింది.

కడుపుబ్బా నవ్వించేలా ఉన్న ఈ టీజర్‌ మూవీపై అంచనాలు పెంచింది. ఐవీ ప్రొడక్షన్స్‌, మారుతి టీమ్‌తో కలిసి సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ ఇంటింటి రామాయణాన్ని తెరకెక్కించింది. కరీంనగర్‌లో జరిగే కథ ఇది. ఇందులో రాములు అనే క్యారెక్టర్‌లో నరేష్‌ కనిపించాడు. అతని ఫ్యామిలీ కథే ఈ 'ఇంటింటి రామాయణం' (Intinti Ramayanam). 

Read More: ఆహాలో సరికొత్త షో 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' (Comedy Stock Exchange).. జడ్జిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)!

Credits: Instagram
You May Also Like These