కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Tahlapathy Vijay) నటిస్తున్న తొలి తెలుగు సినిమా 'వారసుడు' (Vaarasudu). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది.
వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) దర్శత్వం వహిస్తున్న 'వారసుడు' (Vaarasudu) సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. కార్తీక్ పళని ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగి బాబు, జయసుధ, సంగీత క్రిష్, ఖుష్బూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'వారసుడు' (Vaarasudu) డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమా పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'వరిసు' ద్విభాషా చిత్రమా కాదా అని ఇంటర్వ్యూయర్ అడగ్గా, 'వరిసు' పూర్తిగా తమిళ చిత్రమని కుండబద్దలు కొట్టేశారు. కాబట్టి, ఈ సినిమా తెలుగు వెర్షన్ 'వారసుడు' డబ్బింగ్ సినిమా అని ఇప్పుడు ధృవీకరించబడింది.
మరోవైపు.. దీపావళి సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి కొత్త పోస్టర్‌ను (Vaarasudu Release Poster) విడుదల చేశారు. పోస్టర్ లో స్టార్ యాక్టర్ విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్‌తో సినిమా 2023 పొంగల్ రేసులో ఉండబోతోందని మూవీ టీమ్ రీ కన్ఫర్మ్ చేసింది. వారసుడు జనవరి 12,2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో తెలుగులోనూ మరోసారి అదిరిపోయే మార్కెట్ ను సొంతం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో హక్కులు రూ.10కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. డిజిటల్ హక్కులు రూ.60 కోట్ల రూపాయలకు, శాటిలైట్ హక్కులు రూ.50 కోట్ల రూపాయలకు అమ్ముడయినట్లు సమాచారం.
Follow Us