Jagapathi Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా నటించిన జగపతిబాబు ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. కరోనా పుణ్యమాని ఓటీటీలు (OTT) వచ్చాక వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న 'పరంపర 2' (Prampara2) సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జగపతిబాబు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు (Jagapathi Babu).. "పాలిటిక్స్ అనే మాయలో పడి అర్థం చేసుకోవడం నాతో కాదని ఆయన చెప్పుకొచ్చారు. నాకు అంత మైండ్ లేదని, ఒకవేళ ఉన్నా అంత ఓపిక కూడా లేదని జగపతి బాబు అన్నారు. అందుకే పాలిటిక్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. నాకు నలుగురితో మాట్లాడి మెప్పించే తెలివి లేదని, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వారితో దూసుకెళ్లడం అంత సులువైన పని కాదు అని అన్నారు. నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, పార్టీ పెట్టడం అనేది జరగని పని. భవిష్యత్తులో కూడా ఆ నిర్ణయం తీసుకునే ఉద్దేశం కూడా లేదని" షాకింగ్ కామెంట్స్ చేశారు జగతిబాబు.
ఇప్పటి వరకు కెరీర్‌లో 100 సినిమాలకు పైగానే నటించాడు జేబీ. అలనాటి నటుడు శోభన్ బాబు (Actor Shobhan Babu) తర్వాత ఇద్దరు పెళ్లాల కథలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు ఈయన. ఇక, జగపతిబాబు సినిమాల విషయానికి వస్తే.. 90ల్లో ఆయన నటించిన కుటుంబ కథా చిత్రాలు సంచలన విజయాలను సాధించాయి. అలాగే గాయం, మనోహరం లాంటి సినిమాలతో నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఎస్.వి.కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన మావిచిగురు, పెళ్ళి పీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. మావిచిగురు సినిమాతో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు జగపతి బాబు. సౌందర్యతో (Actress Soundarya) ఈయన కాంబినేషన్ అప్పట్లో సెన్సేషన్. ఒకే మూసలో వెళ్లకుండా అప్పుడప్పుడూ అంతఃపురం, మనోహర్ లాంటి సినిమాలు కూడా చేసాడు జగపతిబాబు.
Follow Us