పలు టాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన బ్యూటీ నటి పూర్ణ (Actress Poorna). హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ప్రస్తుతం బుల్లితెరపై కూడా అదరగొడుతోంది. సీమ టపాకాయ్, అవును, అఖండ (Akhanda), దృశ్యం-2 చిత్రాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. అయితే సినిమాల ద్వారా పూర్ణ పెద్దగా పేరు ప్రఖ్యాతలు పొందలేకపోయింది. ఎప్పుడైతే ఢీ షోకి జడ్జిగా వచ్చిందో అప్పటి నుండి పూర్ణ పేరు మారు మ్రోగింది.
ఢీ షోకు (Dhee Dance Show) జడ్జిగా వ్యవహరించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఈ బ్యూటీ. కెరీర్ పీక్స్‌లో ఉండగానే షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను ఎంగేజ్‌మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనుంది. అయితే తాజాగా నటి పూర్ణ గురించి ఓ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నటి పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయిందని టాలివుడ్ సినిమా ఇండస్ట్రీలో కోడై కూస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఆమె నిశ్చితార్ధం (Poorna Engagement) చేసుకుని ఓ ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడబోతున్నట్లుగా ఈ మధ్యనే తెలిపిన ఈ అమ్మడు.. కోట్లు ఖర్చు చేసి నిశ్చితార్ధాని గ్రాండ్ గా చేసుకుంది. ‘కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను’ అంటూ కాబోయే భర్తతో దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది.
అయితే పూర్ణ పెళ్లి (Poorna Marriage) త్వరలోనే జరగనుందని, ఇక నటనకు కూడా గుడ్ బై చెప్పనుందని జోరుగా ప్రచారాలు నడుస్తున్న సమయంలో సడెన్ గా ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం పూర్ణ ఓ డైరెక్టర్ తో ఎఫైర్ ఉందని తెలియడం అని అంటున్నారు. అది తెలుసుకొనే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అని గాసిప్ రాయుళ్లు తెగ ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం ఉందా,లేదా? అనేది పూర్ణ స్పందిస్తేనే తెలుస్తుంది.
అయితే నటి పూర్ణ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఇంతగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ఆమె మాత్రం ఇప్పటివరకూ ఈ పెళ్లి క్యాన్సిల్ (Poorna Marriage Cancelled) వ్యవహారం పై మాత్రం స్పందించడం లేదు. దీంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
Read More: 'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం..' ఆసక్తికరంగా 'కార్తికేయ 2' ట్రైలర్
Follow Us