Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం 'అరి' .. ఇటీవలే టైటిల్ లోగో రిలీజ్ !

ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా టీవీ షోలతో కూడా బిజీగా ఉన్నారు అనసూయ (Anasuya Bharadwaj)

ప్రముఖ టివి వ్యాఖ్యాత, నటి అనసూయ భరద్వాజ (Anasuya Bharadwaj) ప్రధాన పాత్రలో  తెరకెక్కుతున్న చిత్రం 'అరి'. వైవా హర్ష, శుభలేఖ సుధాకర్, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. 'పేపర్ బాయ్' చిత్ర దర్శకుడు జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండవ చిత్రమిది. 

జయశంకర్ దర్శకత్వంలో

శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగ్గా, టైటిల్‌ లోగోను హుజూరాబాద్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ 'అరి అంటే శత్రువు అని అర్థం. ఇదో సంస్కృత పదం' అని తెలిపారు. 

యాంకర్‌గా సుపరిచితురాలైన అనసూయ (Anasuya Bharadwaj) సినిమా నటిగా కూడా పాపులర్ అయ్యారు. రంగస్థలం, కథనం, క్షణం, చావు కబురు చల్లగా, థాంక్యూ బ్రదర్, కిలాడి, పుష్ప చిత్రాల్లోని పాత్రలకు ఈమెకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం పక్కా కమర్షియల్, రంగమార్తాండ చిత్రాలలో కూడా ఈమె నటిస్తున్నారు. 

ఇతర భాషా చిత్రాలలో అనసూయ

అనసూయ (Anasuya Bharadwaj) ప్రస్తుతం ఇతర భాషా చిత్రాలలో కూడా నటిస్తున్నారు. ఈమె తొలిసారిగా మలయాళంలో నటించిన భీష్మ పర్వం చిత్రం ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ మధ్యకాలంలో సినిమాలలో అనసూయ మంచి ప్రాధాన్యమున్న పాత్రలలోనే నటిస్తున్నారు. 'క్షణం' సినిమాలో నటనకు సహాయ నటిగా ఐఫా అవార్డుతో పాటు సైమా అవార్డు కూడా అందుకున్నారు. 

అలాగే 'రంగస్థలం' సినిమాలో నటనకు గాను అనసూయ గతంలో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు సైమా అవార్డు, జీ సినీ పురస్కారం కూడా అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా టీవీ షోలతో కూడా బిజీగా ఉన్నారు అనసూయ (Anasuya Bharadwaj). గతంలో జబర్దస్త్ లాంటి షోలతో పాపులర్ అయిన అనసూయ.. ఇటీవలే 'మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 1' కి ప్రెజెంటర్‌గా కూడా వ్యవహరించారు. 

Read More: 'మైఖేల్' షూటింగ్ సెట్లో సందీప్, వ‌రుణ్, అన‌సూయ‌.. ఫొటోలు వైర‌ల్

Credits: Instagram
You May Also Like These